పవన్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తున్నారా ?  

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కేంద్ర బిజెపి పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఏపీలో బిజెపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.వచ్చే ఎన్నికల్లో కలిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్నాయి.

ఈ రెండు పార్టీలతో టిడిపి కలుస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కచ్చితంగా ఏపీలో విజయం సాధించవచ్చనే లెక్కల్లో బిజెపి అగ్ర నేతలు ఉన్నారట.

జన సైనికులు పవన్ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుండగా,  ఈ విషయంలోనే పవన్ మొహమాటపడుతున్నారు.

సీఎం అవ్వాలంటే దానికి చాలా అనుభవం కావాలని, మెజార్టీ సీట్లు దక్కకపోతే తాను సీఎం ఎలా అవుతాను అంటూ అభిమానులనే ప్రశ్నించారు.

అయితే ఇటీవల కాలంలో నిర్వహించిన వారాహి యాత్రతో( Varahi Yatra )జనసేనలో ఉత్సాహం పెరగడం , వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన కీలకం కాబోతుండడం వంటివి లెక్కలు వేసుకునే బిజెపి పెద్దలు పవన్ త్వరలోనే బిజెపి, జనసేన కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే ఆలోచనతో ఉన్నారట.

"""/" / ఇదే విషయమే త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందట.

అదే కనుక జరిగితే టిడిపి ఇక ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆలోచనను విరమించుకోవాల్సిందే.

ఎందుకంటే జనసేన, బిజెపి, టిడిపి కలిసి ఎన్నికలలో పోటీ చేసినా సీఎం అభ్యర్థిగా చంద్రబాబు మాత్రమే ఉంటారు.

ఆ పదవి కాకుండా వేరే ఒకరికి ఆ పదవిని ఇచ్చేందుకు చంద్రబాబు ఏ మాత్రం అంగీకరించరు .

ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే టిడిపిని కలుపుకుని వెళ్లాలని ఆయన బిజెపి పెద్దలపై ఒత్తిడి చేస్తున్నారు.

"""/" / అదే పవన్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే టిడిపి( TDP Party )ని ఆయన పూర్తిగా పక్కన పెడతారని బిజెపి పెద్దలు ఆలోచిస్తున్నారట.

ఇటీవల నిర్వహించిన ఎన్డీఏ సమావేశానికి టిడిపిని కాదని పవన్ ను ఆహ్వానించడం,  అక్కడ ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం ,ఈ సందర్భంగానే ఏపీ రాజకీయంపై రూట్ మ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఏపీలో బిజెపి జనసేన గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనాకు రావడంతోనే, పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని నిర్ణయానికి కారణమట.

.

‘హెలికాప్టర్ ‘ కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ?