ఖర్జూరం తినేటప్పుడు మీరు కూడా ఈ మిస్టేక్ చేస్తున్నారా..?
TeluguStop.com
ఖర్జూరం( Dates ) ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.అలాగే ఖర్జూరంలో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా నిండి ఉంటాయి.
ఆరోగ్యపరంగా ఖర్జూరం అపారమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది.అందుకే అందరూ ఎంతో ఇష్టంగా ఖర్జూరాలను తింటూ ఉంటారు.
అయితే ఖర్జూరం తినే సమయంలో దాదాపు అందరూ చేసే బిగ్ మిస్టేక్ ఒకటి ఉంది.
అదేంటంటే ఖర్జూరం లోపల ఉండే గింజను పారేయడం.నిజానికి ఖర్జూరమే కాదు ఖర్జూరం గింజలు( Date Seeds ) కూడా ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి.
మనకు అనేక లాభాలు చేకూరుస్తాయి.ఖర్జూరం గింజల్లో ఫ్లేవనాయిడ్లు మరియు ఇతర సమ్మేళనాలు ఉంటాయి.
ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి.వృద్ధాప్యం వల్ల వచ్చే వ్యాధులను నివారించడంలో మరియు శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.
అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సత్తా ఖర్జూరం గింజలకు ఉంది.ఖర్జూరం గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలను వదిలించుకోవచ్చు.
"""/" /
మధుమేహం వ్యాధికి( Diabetes ) దూరంగా ఉండాలని భావించేవారు ఖర్జూరం గింజలను అస్సలు వదలకండి.
ఎందుకంటే, ఖర్జూరం గింజల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు నిండి ఉంటాయి.ఇవి మధుమేహం బారిన పడకుండా మిమ్మల్ని రక్షిస్తాయి.
అలాగే ఖర్జూర గింజలు ప్రీబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి గట్ హెల్త్ ను ప్రోత్సహిస్తాయి.
ఖర్జూర గింజల్లో ఉండే ఫైబర్ కంటెంట్ ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది.మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది.
"""/" /
అంతేకాకుదు ఖర్జూరంలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.క్యాన్సర్ కు( Cancer ) అడ్డుకట్ట వేసే లక్షణాలు ఉంటాయి.
మరియు రోగ నిరోధక శక్తిని పెంపొందించే యాంటీ ఆక్సిడెంట్స్ ను కూడా కలిగి ఉంటాయి.
అందుకే ఖర్జూరం గింజలను ఇకపై అస్సలు వేస్ట్ చేయకండి.వీటిని ఎండిబెట్టి పొడిగా చేసి, స్మూతీస్, జ్యూసెస్ యాడ్ చేసి తీసుకోవచ్చు.
అలాగే కాఫీ పౌడర్ కు ప్రత్యామ్నాయంగా కూడా ఖర్జూర గింజల పొడిని ఉపయోగించవచ్చు.
ఒక చెంచా ఖర్జూర గింజల పొడిని గోరువెచ్చని పాలలో కలుపుకుని ఉదయాన్నే తాగినా మంచి ఫలితం ఉంటుంది.