పాలంటే అలర్జీనా? అయితే కాల్షియం, ప్రోటీన్ కోసం ఈ ఫుడ్స్ తీసుకోండి! TeluguStop.com
కాల్షియం, ప్రోటీన్.శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాలు ఇవి.
ఆరోగ్యంగా జీవించాలంటే ఈ రెండిటినీ నిత్యం తీసుకోవాలి.అయితే కాల్షియం, ప్రోటీన్ లకు గొప్ప మూలం పాలు.
సంపూర్ణ పోషకాహారం అయిన పాలు రుచిగా ఉండటమే కాదు.కాల్షియం, ప్రోటీన్ లను సమృద్ధిగా కలిగి ఉంటాయి.
అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గ్లాస్ పాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
ఇకపోతే కొందరికి పాలంటే పరమ అలర్జీ ఉంటుంది.ఇలాంటి వారికి పాల రుచే కాదు వాసన కూడా పడదు.
దాంతో పాలంటే ఆమడ దూరం పారి పోతుంటారు.అయితే పాలను ఎవైడ్ చేసే వారిలో కాల్షియం, ప్రోటీన్ కొరత ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అందుకే ఆ పోషకాలను భర్తీ చేయడానికి పాలకు బదులు వేరే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.
మరి ఆ వేరే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.పాలలో ఉండే ప్రోటీన్‌ను వేరే ఫుడ్స్ ద్వారా పొందాలనుకుంటే.
ఎగ్స్, బాదం పప్పు, చికెన్ బ్రెస్ట్, పుచ్చ గింజలు, ఫిష్, వేరుశనగలు, బ్లాక్ బీన్స్, స్వీట్ కార్న్, ఓట్స్, జామ పండ్లు, అవకాడో, పప్పు ధాన్యాలు, చియా విత్తనాలు, మొలకెత్తిన గింజలు వంటి ఫుడ్స్‌ను డైట్ లో చేర్చుకోవాలి.
తద్వారా శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది. """/" /
అలాగే కాల్షియం కోసం.
పాలకూర, తోటకూర, మెంతికూర, ఎండిన అంజీర్ పండ్లు, సోయా బీన్స్, సన్ ఫ్లెవర్ సీడ్స్, బ్రోకలీ, నువ్వులు, చిలకడదుంపలు, ఆరెంజ్ పండ్లు, కాబూలీ శనగలు వంటి ఆహారాపలను తీసుకోవాలి.
వీటిలో కాల్షియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.అందు వల్ల, పాలంటే అలర్జీ ఉన్న వారు ఈ ఫుడ్స్ ను ఆమారంలో భాగం చేసుకుంటే శరీరంలో కాల్షియం కొరత ఏర్పడకుండా ఉంటుంది.
అతిగా యాడ్స్ వేయడంతో పీవీఆర్ – ఐనాక్స్కి షాక్ ఇచ్చిన వినియోగదారుడు!