ఏపీ బీజేపీని దెబ్బతీస్తోంది ఆ ఇద్దరే ? వీరంతా  అసంతృప్తి ? 

ఏపీ బీజేపీలో అంతర్గతంగా పోరు నడుస్తోంది.ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు,  రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పార్టీ విధివిధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, బిజెపిలోని ఈ ఇద్దరి వ్యతిరేక వర్గం భావిస్తోంది.

అంతేకాకుండా వీర్రాజు,  జివిఎల్ నరసింహారావు కు వ్యతిరేకంగా విజయవాడలో సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారట.

పార్టీ వివిధ విధానాలను పక్కనపెట్టి వైసీపీకి అనుకూలంగా వీరిద్దరూ వ్యవహరిస్తున్నారని, ఈ ఇద్దరి నుంచి పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలనే అంశం పైన చర్చించినట్లు సమాచారం.

ముఖ్యంగా సోము వీర్రాజు వైఖరిని కొంతమంది నేతలు తప్పుపట్టారట.పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి కొత్తగా చేరిన వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని,  గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న నాయకులు అభిప్రాయ పడ్డారట.

"""/"/ కొద్దిరోజుల క్రితం బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ నేతృత్వంలో విజయవాడలో రహస్యంగా భేటీ అయిన నేతలు సోమ వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తప్పించేలా,  సత్య కుమార్ కు ఏపీ బిజెపి అధ్యక్ష పదవి దక్కే విధంగా హై కమాండ్ పై ఒత్తిడి చేయాలని నిర్ణయించుకున్నారట.

అయితే ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన జివిఎల్ నరసింహారావు బిజెపి ఏపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియోధర్ ద్వారా .

"""/"/ఎన్నికల వరకు సోము వీర్రాజు ఏవి బిజెపి అధ్యక్షుడిగా ఉంటారని ప్రకటన చేయించారట.

అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించే విధంగా హై కమాండ్ పై ఒత్తిడి చేయాలని బిజెపిలోని వీర్రాజు వ్యతిరేక వర్గం  నివేదిక తయారు చేసి పంపించాలనే అలోచనకు వచ్చారట.

వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నంతకాలం పార్టీ ఏపీలో బలోపేతం అవదని,  ఆయన గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నా రని,   పార్టీలో చేరిన వారిపై ముద్ర వేసి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఇలా ఎన్నో ఫిర్యాదులను నివేదిక రూపంలో పంపించేందుకు వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వ్యతిరేక వర్గం భావిస్తోందట.

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి సిద్ధమైన సీనియర్ హీరోయిన్లు..