ఈట‌ల‌కు ఇంత మెజార్టీ రావ‌డం వెన‌క ఉన్న‌ది వారేనా..?

ఈట‌ల‌కు ఇంత మెజార్టీ రావ‌డం వెన‌క ఉన్న‌ది వారేనా?

అంద‌రి అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి.కానీ అంచానాల‌ను మించిన ఫ‌లితాలు వ‌చ్చాయి.

ఈట‌ల‌కు ఇంత మెజార్టీ రావ‌డం వెన‌క ఉన్న‌ది వారేనా?

దంతో అంద‌రూ షాక్ అయిపోతున్నారు.హుజూరాబాద్ ఉప ఎన్నిక చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా జ‌రిగింద‌నే చెబుతున్నారు.

ఈట‌ల‌కు ఇంత మెజార్టీ రావ‌డం వెన‌క ఉన్న‌ది వారేనా?

ఎందుకంటే వందల కోట్లు ఖ‌ర్చు పెట్టినా కూడా ఈట‌ల గెలుపును టీఆర్ ఎస్ అడ్డుకోలేక‌పోయింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ద‌ళితుల‌ ఓట్ల కోసం ద‌ళిత బంధును పెట్టినా కూడా వారి ఓట్ల‌ను కూడా ఆక‌ర్షించ‌లేక‌పోయింది.

అయితే ఇక్క‌డే చాలా సందేహాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు వ‌చ్చిన ఓట్ల‌తో పోలిస్తే అనుమ‌నాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

ఎందుకంటే గ‌తంలో ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి దాదాపు 60వేల పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి.

మ‌రి ఇప్పుడు కేవ‌లం 3వేల ఓట్ల‌కు బ‌ల్మూరి వెంక‌ట్ ప‌రిమితం కావ‌డం వెన‌క కార‌ణ‌మేంట‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ కావాల‌ని అభ్య‌ర్థిని లేటు చేసి ఆ ఓట్ల‌న్నీ ఈట‌ల రాజేంద‌ర్‌కు వెళ్లే విధంగా చేసింద‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి.

టీఆర్ ఎస్‌కు ఈ ఎన్నిక‌ల్లో బాగానే ఓట్లు ప‌డ్డాయి.దీన్ని బ‌ట్టి చూస్తే టీఆర్ ఎస్ ఓటు బ్యాంకు పెద్ద‌గా దెబ్బ తిన‌లేదు.

అంటే చిర‌వ‌కు కాంగ్రెస్ ఓట్లే ఈట‌ల వైపు మ‌ళ్లాయ‌ని చెప్పాలి.పోనీ ఈటల రాజేంద‌ర్ గెలుపు ఖాయ‌మే అనుకున్నా కూడా చాలా ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని అంతా భావించారు.

దుబ్బాక మాదిరి న‌రాలు తెగేంత ఉత్కంఠ ఉంటుంద‌ని అనుకున్నా కూడా ఇంత మెజార్టీ రావ‌డానికి కార‌ణాలు ఏంటి.

ఎందుకంటే టీఆర్ ఎస్‌కు కూడా భారీగా ఓట్లు ప‌డ్డ స‌మ‌యంలో ఇంత‌లా మెజార్టీ రావ‌డానికి మాత్రం కాంగ్రెస్ ఓట్లు చీలి ఈట‌లకు ప‌డ్డాయ‌ని చెబుతున్నారు కాంగ్రెస్ లీడ‌ర్లు.

ఇదే విష‌య‌మై రేవంత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్లు.

మొత్తానికి ఈట‌ల గెలుపు వెన‌క కాంగ్రెస్ ఉన్న‌ద‌న్న‌మాట‌.

ఈ ఎఫెక్టివ్ ప్యాక్ తో మీ జుట్టు రెండింత‌లు అవుతుంది!

ఈ ఎఫెక్టివ్ ప్యాక్ తో మీ జుట్టు రెండింత‌లు అవుతుంది!