Rathika Rose: రాహుల్ సిప్లిగంజ్ రతిక రోజ్ మధ్య చిచ్చు పెట్టింది వారేనా.. అందుకే లవ్ బ్రేకప్ అయ్యిందా..?

ఎప్పుడైతే బిగ్ బాస్ 7 (Bigg Boss 7) లోకి రతిక రోజ్ ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి ఆమెకు సంబంధించిన లవ్ ఫెయిల్యూర్ వార్తలు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే మొదటి రోజు ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో రతిక లవర్ ఎవరు అని అందరూ అనుమానపడ్డారు.

కానీ ఆ టైంలో ఎవరు కూడా రతిక లవర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) అని గుర్తు పట్టలేకపోయారు.

కానీ హౌస్ లోకి వచ్చాక ఓ రోజు రతిక రాహుల్ కోసం ఏడవడం అలాగే బిగ్ బాస్ రాహుల్ పాడిన ఒక పాట ప్లే చేయడంతో అందరికీ రతిక రాహుల్ మధ్య ఉన్న ప్రేమ విషయం బయటపడింది.

ఇక ఈ వార్త బయట పడ్డాక అందరూ రతిక రాహుల్ సిప్లిగంజ్ ల మధ్య బ్రేకప్ కి కారణం పునర్నవి అని భావించారు.

ఎందుకంటే రాహుల్ సిప్లిగంజ్ హౌస్ లోకి వచ్చాక పునర్నవి (Punarnavi) తో క్లోజ్ గా ఉండడం వల్లే రతిక రాహుల్ కి బ్రేకప్ చెప్పింది అని అనుకున్నారు.

కానీ అసలు విషయం వేరే ఉందట.అదేంటంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రతిక రోజ్ తన బ్రేకప్ కి కారణం చెప్పింది.

"""/" / రతిక (Rathika) ఈ ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ పేరు తీయకుండా మాట్లాడుతూ.

నేను తెలుగులో రెండు మూడు సినిమాలు చేశాను.ఆ తర్వాత ఓ సినిమా చేసే సమయంలో పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను.

కానీ అదే సమయంలో నా లవర్ పేరెంట్స్ మాత్రం నువ్వు పెళ్లయ్యాక పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇవ్వాలి.

సినిమాలు వదిలేసి ఏదైనా జాబ్ చేయు అంటూ నాకు కండిషన్ పెట్టారు.దాంతో ఇప్పుడిప్పుడే నాకు సినిమాల్లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

"""/" / ఇక అలాంటి టైం లో వీరు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండమంటున్నారు.

కానీ ఈ పరిస్థితుల్లో నేను పెళ్లికి దూరంగా ఉండటమే మంచిది.పెళ్లి చేసుకోవడానికి ఇంకాస్త టైం తీసుకుంటాను అని నిర్ణయించుకున్నాను అంటూ రతిక రోజ్ (Rathika Rose) ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

అయితే రతిక రాహుల్ సిప్లిగంజ్ ల మధ్య బ్రేకప్ అవ్వడానికి కారణం రాహుల్ ఫ్యామిలీ పెట్టిన కండిషనే అని తెలుస్తోంది.

వాళ్లు సినిమాలకు దూరంగా ఉండమని కండిషన్ పెట్టడం వల్లే అది ఇష్టం లేని రతిక రాహుల్ కి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది.

కేరళలో 278 కోట్ల రూపాయలతో సుమకు లగ్జరీ హౌస్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?