మన శరీరంలో ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఉండడానికి కారణాలు ఇవేనా..

ప్రస్తుత సమాజంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలకు ఉన్న సమస్యలలో ప్రధానమైన సమస్య అధిక కొలెస్ట్రాల్.

మనం ప్రతిరోజు తీసుకునే ఆహారం జీవక్రియల ద్వారా ఈ కొలెస్ట్రాల్ అనేది తయారవుతుంది.

ఇది ప్రోటీన్ లతో కలిసి రక్తం ద్వారా శరీరంలో ఉంటుంది.ట్రై గ్లిజరైడ్స్ కూడా రక్తంలో ఉండే ఒక రకమైన ఫ్యాట్ వల్ల గుండెజబ్బులు పెరిగే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.బాడీ మాస్ ఇండెక్స్ 30 అంతకంటే అధికంగా ఉంటే విరిగి అధిక ప్రమాదం ఉంటుంది.

ఈ మధ్యకాలంలో చాలామంది యువత వ్యాయామం, శరీరక శ్రమ లేకుండా అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు.

ఎందుకంటే హెచ్ డి ఎల్ అనే శరీరానికి మంచి చేసే కొలెస్ట్రాల్,మనం రోజు చేసే వ్యాయామంతోనే మన శరీరంలో పెరుగుతుంది.

పొగ త్రాగడం వల్ల కూడా మన శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయే అవకాశం ఉంది.

ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవారిలో కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది.

అయితే 40 సంవత్సరాల వయసు దాటిన వారిలో కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది.

"""/"/ ఎందుకంటే వయసు పెరుగుతున్న క్రమంలో ఎల్డీఎల్ ను తొలగించే శక్తి కాలయానికి తగ్గే అవకాశం ఉంది.

కిడ్నీ సమస్యలు, మధుమేహం, హైపో థైరాయిడిజం లాంటి ఆరోగ్య సమస్యల వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది.

మొటిమలు, కేన్సర్, అధిక రక్తపోటు, ఎయిడ్స్ ఇలాంటి వ్యాధుల కోసం ఉపయోగించే ఔషధాల వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండడం వల్ల రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడి, గుండెకు సరఫరా అయ్యే రక్తం ఆగిపోవడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి జీవితంలో కొన్ని మార్పులను చేసుకోవాలి.ఈ మార్పులలో ఉప్పును కూడా తక్కువగా తీసుకోవడం మంచిది.

అంతే కాకుండా పండ్లు కూరగాయలు ముడి ధాన్యాలకు మనం రోజు తీసుకునే ఆహారంలో ప్రాధాన్యత ఇవ్వాలి.

న్యాచురల్ గా షైనీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!