ఈ ఇయర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో భారీ సక్సెస్ అయిన సినిమాలు ఇవేనా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సంవత్సరం భారీ సినిమాలు వచ్చినప్పటికి అందులో కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాలను సాధించాయి.
అయితే పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధిస్తున్న సినిమాలన్నింటిలో తెలుగు సినిమాలే ముందు వరుసలో ఉండడం విశేషం.
అయిన కూడా ప్రభాస్ ( Prabhas )లాంటి స్టార్ హీరో సైతం ఈ సంవత్సరం ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.
ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా( Kalki Movie ) ఈ ఇయర్లోనే రిలీజ్ అయి భారీ వసూళ్లను రాబట్టింది.
1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పటివరకు ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.
"""/" /
ఇక ఈ సినిమాతో పాటుగా చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా( Hanuman Movie ) 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి రెండో పొజిషన్ ను దక్కించుకుంది.
దేవర ( Devara )సినిమాతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయాలన ప్రయత్నం చేసినప్పటికి కేవలం ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టడం అనేది చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి.
ఇక ఎన్టీఆర్ తన సత్తాను చాటుకోలేకపోవడంతో పాన్ ఇండియాలో ఆయన మార్కెట్ కొంతవరకు డౌన్ అయిందనే చెప్పాలి.
ఇక ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్ హనుమాన్ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక దానికి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమాని కూడా రంగంలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పుడు పుష్ప సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో వస్తుంది.కాబట్టి పుష్ప 2 సినిమా( Pushpa 2 Movie ) ఎంతవరకు కలెక్షన్స్ ను రాబడుతోంది.
"""/" /
ఈ ఇయర్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో పుష్ప 2 నెంబర్ వన్ పొజిషన్ లో నిలుస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
ఇక ఈ సినిమాకు ఉన్న హైప్ ని చూస్తుంటే సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని దక్కించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
చూడాలి మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.
ఇక ఈ సినిమా కనక 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టకపోతే ఈ ఇయర్ లో ప్రభాస్ భారీ సక్సెస్ ను సాధించిన హీరోగా గుర్తింపును సంపాదించుకుంటాడు.
సీఎం పదవినే వద్దనుకున్న సోనూసూద్.. ఈ హీరో నిజంగా గ్రేట్ అని అనాల్సిందే!