జగన్ హిట్ లిస్ట్ లోని ఎమ్మెల్యే లు వీరేనా ? 

వచ్చే ఎన్నికల్లోను ఏపీలో మళ్ళీ వైసీపీనే( YCP ) అధికారంలోకి వస్తుందని, 175 స్థానాలకు 175 గెలుచుకుంటామనే ధీమా ను వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని, ఇంకా మరికొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, తప్పకుండా గెలిపిస్తామనే ధీమాతో జగన్ ఉన్నారు.

దీంతో పాటు ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయిస్తూ,  ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో సర్వే నివేదిక ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని పదేపదే జగన్ పార్టీ( Jagan ) ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు.

ఎమ్మెల్యేలు,  ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో 19 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగాలేదని,  జగన్ ప్రకటించారు.

అయితే ఎక్కడా వారి పేర్లను ప్రస్తావించకుండా పనితీరు మార్చుకోవాలని సూచించారు.దీంతో జగన్ చెప్పిన ఆ 19 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

"""/" / జగన్ ప్రకటించకపోయినా,  పార్టీ కీలక నేతలు ద్వారా ఆ 19 మంది ఎమ్మెల్యేల పేర్ల లిస్టు బయటకు వచ్చింది .

దీంట్లో రాయలసీమ ( Rayalaseema )నుంచి చూస్తే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు,  పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ,తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి,  కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉష శ్రీ చరణ్( MLA Minister Usha Sri Charan ) , బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా.

ఇక దక్షిణ కోస్తా జిల్లాల విషయానికొస్తే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ,  సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి , పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య,  నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రరావు ఉన్నారు.

"""/" / అలాగే ఉత్తరాంధ్రలో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్( MLA Avanti Srinivas ),  పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు,  బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి అప్పలనాయుడు , ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

త్వరలోనే వీరందరినీ పిలిచి స్వయంగా జగన్ క్లాస్ పీకే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వీడియో: పూజ చేస్తుండగా దూసుకు వచ్చిన పాము.. భక్తురాలు ఏం చేసిందంటే..