మీ ఇంట్లోకి ఈ పక్షులు వస్తున్నాయా..? అయితే అదృష్టం తిష్ట వేసినట్టే..!

హిందూమతంలో దేవతలతో పాటు భూమి, ఆకాశం, చెట్లు, మొక్కలు, జంతువులు, పక్షులను కూడా పూజిస్తారు.

ఇక నేటి కాలంలో అయితే ప్రతి వ్యక్తి తమ ఇంట్లో ఆనందం, సంపద, మానసిక ప్రశాంతత ఉండాలని కోరుకుంటూ ఉంటారు.

అయితే వాస్తు ప్రకారం నడుచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.వాస్తు శాస్త్రం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడానికి అలాగే నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి సహాయపడుతుంది.

అలాంటివే పవిత్రంగా భావించే కొన్ని పక్షులు కూడా మీ అదృష్టాన్ని ప్రకాశింపజేసే సంకేతాలను అందిస్తాయి.

అయితే అదృష్టాన్ని తెచ్చే అలాంటి పక్షులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. """/" / వాస్తు శాస్త్రం ప్రకారం పాలపిట్ట( Bird Palapitta ) మన ఇంటికి రావడం చాలా శుభ్రంగా పరిగణించబడుతుంది.

అయితే నీలకంఠ పక్షిని పాలపిట్ట అని అంటారు.ఇది ప్రత్యేకంగా దసరా రోజున కనిపిస్తే మీ అదృష్టం పెరుగుతుంది.

సాధారణంగా గుడ్లగూబను మహాలక్ష్మికి వాహనంగా పరిగణిస్తారు.అందుకే మీరు ఇల్లు, దుకాణం లేదా మరి ఏదైనా ఆస్తికి సమీపంలో గుడ్లగూబ( Owl )ని చూస్తే ఏదైనా మంచి జరగబోతుందని సంకేతం.

"""/" / వాస్తు శాస్త్ర పండితుల ప్రకారం అనుకోకుండా మీ ఇంటికి చిలుక( Parrot ) వచ్చి కాసేపు ఉండి వెళ్తే మీకు ఎక్కడి నుండైనా అనుకోకుండా డబ్బు వస్తుందని సంకేతం.

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకుంటే ఇంట్లో త్వరలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుందని సంకేతం.

ఇక ఇంటికి కాకి వస్తే అతిధులు వస్తారని అర్థం.అలాగే ఇంట్లోకి కాకులు( Crows ) రావడం చాలా శుభప్రదం.

వాస్తు శాస్త్రం ప్రకారం కోడి కూత విన్నట్లయితే, అరుపులు విన్నట్లయితే మీరు పాత స్నేహితులు, పాత సహ ఉద్యోగులను త్వరలో కలవబోతున్నారని సంకేతం.

సంక్రాంతికి వస్తున్నాం 12 రోజుల కలెక్షన్ల లెక్కలివే.. వెంకీమామ అదరగొట్టారుగా!