ఇంట్లోకి ఈ పక్షులు వస్తున్నాయా..? అయితే ఇది తెలుసుకోండి..!

సాధారణంగా పక్షులు( Birds ) కేవలం ఆకాశంలోనే ఉంటాయని అందరూ అనుకుంటారు.అప్పుడప్పుడు కొన్ని పక్షులు నేల మీద కూడా తిరుగుతూ ఉంటాయి.

ఇక ఇండ్లలోకి కూడా కొన్ని పక్షులు, కీటకాలు వస్తూ ఉంటాయి.కొన్ని పక్షులు వస్తే శుభమని మరికొన్ని పరీక్షలు వస్తే అశుభమని అందరూ అనుకుంటూ ఉంటారు.

అలాగే ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో పిల్లి ( Cat )ఎదురు వస్తే అపశకునంగా భావిస్తారు.

అలాగే కొన్నింటిని మనం లక్ష్మీ ప్రదంగా కూడా భావిస్తూ ఉంటాం. """/" / అయితే మన ఇంటికి ఎలాంటి పక్షులు వస్తే శుభం కలుగుతుంది, ఎలాంటి పక్షులు వస్తే అశుభం కలుగుతుంది అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లోకి పిచ్చుకలు( Sparrows ) ప్రవేశిస్తే చాలా మంచి జరుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎందుకంటే పిచ్చుకలు ఇంట్లోకి రావడానికి శుభసూచకంగా భావించాలి.ఇంట్లోకి పిచ్చుకలు వస్తే అది లక్ష్మీప్రదం.

లక్ష్మీ కటాక్షం మరింత పెరుగుతుందని దానికి అర్థం.అదే రెండు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో కళ్యాణం జరుగుతుంది లేదా సంతానం కలుగబోతుందని అర్థం.

"""/" / కాకి నీ పితృదేవతలకు ప్రతీకగా భావించాలి.అలాగే కాకి ( Crow )ఎగురుతూ ఇంటి దగ్గరకు వస్తే చాలా మంచిది.

మన ఇంటికి పెద్దలు ఆశీర్వదించడానికి వచ్చారని భావించాలి.అంతేకాకుండా బయటకు వెళ్ళినప్పుడు కాకి తల మీద తన్నితే ఏదో ప్రమాదం జరగబోతుందని ఏదో చెడు జరగబోతుంది అని అర్థం.

అలాగే గుడ్లగూబ ఇంట్లోకి వస్తే చాలా మంచిది.గుడ్లగూబ ఇంటికి వస్తే లక్ష్మీ రాబోతుందని అర్థం.

ఎందుకంటే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం కాబట్టి.అందుకే ఇది ఇంట్లోకి వచ్చిన శుభ సూచకంగా భావించాలి.

"""/" / అలాగే ఇంట్లోకి పాము( Snake ) వస్తే మానసిక వేదన ఎక్కువవుతుంది.

అయితే ఇంట్లో ఏదో అశాంతి రాబోతుందని అర్థం.పాము ఇంట్లోకి రావడం అంత మంచిది కాదు.

అంతే కాకుండా తేలు, జెర్రీ కూడా ఇంట్లోకి రావడం మంచి విషయం కాదు.

ఇక ఇల్లు శుభ్రంగా లేనప్పుడు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ( Scorpion, Jerry )లు వస్తూ ఉంటాయి.

వీటి వల్ల చెడు జరుగుతుంది.అందుకే వీలైనంత వరకు తేలు, జెర్రీలు ఇంట్లోకి రాకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

అంతేకాకుండా కొండమిడతలు, కందిరీగ లాంటివి ఇంట్లోకి వచ్చిన శుభప్రదంగా భావించాలి.

వామ్మో దీపికా కట్టిన ఈ చీర ఖరీదు అన్ని లక్షల.. అన్ని వేల గంటలు కష్టపడ్డారా?