నరేష్ మళ్లీ పెళ్లి వెనక ఇన్ని ప్లాన్స్ ఉన్నాయా..?

సీనియర్ నటుడు నరేష్( Naresh ), నటి పవిత్ర లోకేష్ జంట టాలీవుడ్ లో చాలాకాలంగా హాట్ టాపిక్ అవుతుంది .

వీరి పెళ్లిపై కూడా రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి .వీడియోలు బయటకు వచ్చాయి .

ఇక వీరిద్దరూ తాజాగా మళ్ళి పెళ్లి అంటూ ఆడియెన్స్ ముందుకు రావడానికి సిద్ధం అయ్యారు .

నరేష్ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు అవుతోంది.ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ గా నరేష్, పవిత్రా లోకేష్( Pavithra ) కలసి మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటిస్తున్నారు .

ఈ చిత్రానికి ఎమ్‌ఎస్ రాజు( M.S.

Raju ) దర్శకుడు.విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నాడు.

ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ తో ఇప్పటికే సంచలనం సృష్టించింది.తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.

ఇందులో నరేష్ జీవితంలో జరిగిన సంఘటనలనే చూపించారు . """/" / అసలు నరేశ్ ఇలా చేయడానికి కారణమేంటి అనే చర్చలు సాగుతున్నాయి .

నటుడు నరేష్ .రమ్య రఘుపతితో తనకు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించారు.

కానీ దీనికి ఆయన భార్య ఒప్పుకోవడం లేదు.దీంతో పవిత్రా లోకేశ్‌ను చట్టబద్దంగా వివాహం చేసుకోవడానికి నరేశ్‌కు అవకాశం లేదు.

ఇది నరేశ్‌కు బాగా అర్థమైంది.దీంతో తన జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మళ్లీ పెళ్లి సినిమా చేస్తున్నారు.

దీన్ని కన్నడలో కూడా రిలీజ్ చేయడం వెనుక కూడా ఓ రీజన్ ఉందనేది ఆడియెన్స్ మాట .

టీజర్‌లో తన భార్య మీడియా ముందుకు వెళ్లడం, నరేశ్ మీద కంప్లెయింట్ చేయడం, పవిత్రా లోకేశ్‌తో హోటల్‌లో దొరికిపోతే తన భార్య చెప్పు చూపించడం ఇలా అన్ని సీన్లు రీక్రియేట్ చేసేశారు.

"""/" / మీడియాకు, జనాలకు తన భార్యతో ఉన్న గొడవల గురించి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పడం కన్నా .

ఇలా సినిమాగా చూపించడమే బెస్ట్ అని నరేశ్ డిసైడ్ అయ్యారని దీన్ని బట్టి తెలుస్తుంది .

దీని వల్ల అటు తన భార్యే తప్పు చేసిందని నరేశ్ చూపించే అవకాశం ఉంది.

అంతేకాకుండా ఇవన్నీ చూసి విసిగిపోయి తన భార్య విడాకుల కోసం ఒప్పుకుంటుందనే ఆశ కూడా నరేశ్‌కు ఉండొచ్చనే మాట ఫిలిం సర్కిల్స్ లోనే వినిపిస్తుంది .

"""/" / అయితే ఇంత ఖర్చు పెట్టి నరేశ్ దీని కోసం సినిమా తీయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు .

అయితే ఈ సినిమాకు వచ్చిన పబ్లిసిటీ, ప్రమోషన్లు.స్టార్ హీరో చిత్రానికి వచ్చినట్లు ఉంది.

ఇ ఈ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.అటు పర్సనల్‌గా ఇటు ఫైనాన్షియల్‌గా నరేశ్‌కు ఈ చిత్రం ప్లస్ అవుతుందనే మాట వినిపిస్తుంది .

మరి నరేష్ స్కెచ్ బాగానే ఉంది కానీ .అయన అనుకున్నట్టు మొత్తం జరుగుతుందా అనేది చూడాలి .

హరీష్ శంకర్ నిర్మాత గా కిరణ్ అబ్బవరం సినిమా రాబోతుందా..?