రాత్రి నిద్ర పోయేటప్పుడు ఇలా నిద్రపోతే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..

మన శరీరానికి కచ్చితంగా నిద్ర చాలా అవసరం.ఎందుకంటే శరీరానికి తగినంత నిద్ర లేకపోతే ఆరోగ్యం చురకగా ఉండదు.

అందుకే బాగా నిద్రపోతే ఆరోగ్యం ఎప్పుడూ చురుకుగా ఉంటుంది.సరైన నిద్ర లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అయితే నిద్ర మన ఆరోగ్యం మీద ఎలా ప్రభావాన్ని చూపిస్తుందో అదేవిధంగా నిద్రించే భంగిమ కూడా మన ఆరోగ్యం పై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.

సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఉదయం లేచినప్పటి నుంచి చాలా బద్ధకంగా కనిపిస్తుంది.పొట్ట కూడా పూర్తిగా శుభ్రం కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.

అలాగే మనం ఏ భంగిమలో నిద్రిస్తే మన ఆరోగ్యం మేలు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బోర్ల పడుకోవడం వల్ల నడుము నొప్పి అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి.

అంతేకాకుండా కుడి చేయి వైపు తిరిగి పడుకుంటే అస్సలు మంచిది కాదు.ఇలా నిద్రించడం వల్ల గ్యాస్ ఎసిడిటీ, మలబద్ధకం, కడుపుబ్బరం అజీర్తి లాంటి సమస్యలు ఎదురవుతాయి.

ఇక కొందరు ఎడమవైపు తిరిగి పడుకుంటూ ఉంటారు.ఇలా నిద్రించడం అన్నింటికన్నా ఉత్తమమైనదిగా పరిగణించబడింది.

ఎందుకంటే ఎడమ చేతి వైపు నిద్రించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఇలా నిద్రిస్తే అవయవాలు సహజంగా శుభ్రపడతాయి.అలాగే శరీరం నుండి విష పదార్థాలు కూడా తొలగిపోతాయి.

జీర్ణాశయం చక్కగా పనిచేస్తుంది.అలాగే రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

"""/"/ అలాగే తిన్న భోజనం కూడా సులభంగా పెద్దప్రేగులోకి ప్రవేశిస్తుంది.అలాగే పొట్ట కూడా సులభంగా శుభ్రపడుతుంది.

గుండె సంబంధిత వ్యాధులు కూడా దరికి రావు.గర్భిణీ స్త్రీలు కూడా ఎడమవైపు నిద్రించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అలాగే నడుము నొప్పి, మెడ నొప్పి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఎడమవైపు తిరిగి నిద్రించడం వల్ల ఇలాంటి సమస్యలు దూరంగా ఉంటాయి.

అలాగే ఎక్కువగా కూడా నిద్ర వస్తుంది.శ్వాస సంబంధిత సమస్య కూడా దూరమవుతుంది.

ఇలా పడుకుంటే గురకపెట్టకుండా హాయిగా నిద్రించవచ్చు.ఎడమ చేతి వైపు నిద్రిస్తే మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

మంగళగిరిలో టీడీపీ రౌడీ రాజకీయం..!!