నువ్వులను ఆహారంలో భాగం చేసుకుంటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..

మనం రోజు తినే నువ్వుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అయితే ఈ విషయం చాలామందికి తెలియదు.

ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ విటమిన్లు అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.

అలాగే అధిక కొలెస్ట్రాల్ అధిక స్థాయితో బాధపడుతున్న వారికి వారు రోజు కొన్ని నువ్వులు ఆహారంలో చేర్చుకుంటే అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకునే అవకాశం ఉంది.

అయితే అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

అందుకే వాటి నుంచి నువ్వులు మిమ్మల్ని కాపుడతాయి.అందుకే రోజువారి భోజనంలో కొన్ని నువ్వులను చేర్చుకుంటే గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

అంతేకాకుండా ఇందులో లభించే సమ్మేళనాలు పైటోస్టెరాయిస్ వీటిలో లభిస్తాయి.ఈ రెండు కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి.

అందుకే రోజు 40 గ్రాముల నువ్వులను రెండు నెలల పాటు తరచుగా తింటే చెడు కొలెస్ట్రాల్ 10% తగ్గుతుంది.

అలాగే బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్న వారు కూడా నువ్వులు తింటే చాలా మంచిది.

ఎందుకంటే నువ్వుల్లో ఉండే అధిక మెగ్నీషియం, నిల్వలు, బ్లడ్ ప్రెజర్ స్థాయిని తగ్గిస్తాయి.

అందుకే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారు 2.5 గ్రాముల నల్ల నువ్వుల పొడి రోజు తింటే 6 శాతం బ్లడ్ ప్రెషర్ కచ్చితంగా తగ్గుతుంది.

అలాగే రోజు నువ్వులు తింటే ఎముకల బలహీనతను కూడా దూరం చేసుకోవచ్చు. """/"/ ఎందుకంటే నువ్వుల్లో ఉండే కాల్షియం స్థాయి వల్ల బోన్ హెల్త్ బాగా ఉంటుంది.

కానీ పై పొర పోకుండా ఉన్న నువ్వుల్లో మాత్రం క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

అందుకే వీటిని నానబెట్టుకుని లేదా రోస్ట్ చేసుకుని లేదా మొలకలు చేసుకొని తింటే మన శరీరానికి అలాగే మన ఎముకలకి బలం అందుతుంది.

అలాగే మోకాలి నొప్పులు ఉన్నవాళ్లు కూడా నువ్వులు తింటే ఉపశమనం పొందవచ్చు.అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్లు కూడా నువ్వులు తింటే మేలు జరుగుతుంది.

ఇందులో ఉండే ఐరన్, కాపర్, జింక్, విటమిన్ B6 థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Allu Arjun Wax Statue : మేడం టుస్సాడ్స్ లో కొలువుదీరిన అల్లు అర్జున్ స్టాచ్యూ.. మైల్ స్టోన్ మూమెంట్ అంటూ?