మల్టీ గ్రెయిన్ పిండితో తయారుచేసిన రోటీలు.. తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

ప్రస్తుత సమాజంలో దాదాపు చాలా మంది ప్రజలకు ఆరోగ్యం( Health ) పై కాస్త శ్రద్ధ పెరిగింది అని కచ్చితంగా చెప్పవచ్చు.

ఎందుకంటే చాలా మంది ప్రజలు అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తినకుండా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.

అందులో భాగంగానే మల్టీ గ్రెయిన్ పిండితో చేసిన రోటీని ఎంతో మంది ప్రజలు తమ ఆహారంలో భాగం చేసుకుంటూ ఉన్నారు.

ఇలా చేసుకోవడం వల్ల వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.సాధారణంగా మల్టీ గ్రెయిన్ పిండి తో చేసిన రోటీలలో అధిక పోషకాలు ఉంటాయని దాదాపు చాలా మందికి తెలుసు.

ఎందుకంటే మల్టీ గ్రెయిన్ వివిధ ధాన్యాలు కలయిక వల్ల పోషక శక్తిని అందిస్తుంది.

"""/" / ఇది మధుమేహాన్ని( Diabetes ) అదుపులో ఉంచుతుంది.ఇంకా వీటి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ పిండి తో చేసిన రోటీలను తింటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది.

వీటిని క్రమం తప్పకుండా తింటూ ఉంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.ఇన్సూరెన్స్ స్థాయిలను తగ్గించడంలో మల్టీ గ్రెయిన్ పిండి తో తయారు చేసిన ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

అంతే కాకుండా ఇది రక్తపోటును ( Blood Pressure )తగ్గించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.

అలాగే మల్టీ గ్రెయిన్ పిండి తో తయారు చేసిన రోటీలను ప్రస్తుత సమాజంలోని పిల్లలకు తినిపిస్తే వారిలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

"""/" / అలాగే ఈ రోటిలను తింటే ఎముకలు దృఢంగా మారుతాయి.బరువును దూరం చేసుకోవాలని భావించేవారు రోటీలను తింటే ఎక్కువ సమయం పాటు ఆకలి అనిపించదు.

అందుకోసం అధిక బరువుతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఈ రోటీని తీసుకుంటే అధిక బరువు( Overweight ) ను దూరం చేసుకోవచ్చు.

అలాగే ఈ రోటీలను క్రమం తప్పకుండా తీసుకుంటే గ్యాస్, అజీర్ణం లాంటి పొట్ట సంబంధిత అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

అలాగే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.దీని వల్ల కడుపు నొప్పి ( Stomach Ache )లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి.