నవగ్రహ దోషాలు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి..

చాలామంది ప్రజల జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు ఉంటే అనుకున్న పనులు సకాలంలో నెరవేరకపోవడం, ఎన్నో రకాల సమస్యలు రావడం, అనారోగ్య సమస్యలు వంటివి వస్తూ ఉంటాయి.

అయితే ఇలా జాతకంలో గ్రహ దోషాలు ఉన్నవారు వాటికి సరైన పరిహారాలు చేయడం వల్ల జాతక దోషాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది.

మన జ్యోతిష్యులు అన్ని సమస్యలకు ప్రధాన కారణం నవగ్రహ దోషాలు అని చెబుతూ ఉంటారు.

అయితే చాలామందికి ఖర్చుతో కూడుకున్న నవగ్రహ దోషాలు, శాంతి, హోమాలు, దానాలు సాధ్యం కావు.

మరి ఎలా ఈ సమస్యకు పరిష్కారం చెయ్యాలి అని చాలా లక్షలాదిమంది అనుకుంటూ ఉంటారు.

అయితే పలు పురాణాల్లో అనుభవజ్ఞుల జీవితంలో ఆచరించిన చాలా చిన్నచిన్న పరిష్కారాలే నవగ్రహ దోషాలను తొలగిస్తాయి అని చెబుతున్నారు ఇందులో భాగంగా నవగ్రహ దోషం పోవాలంటే అత్యంత సులభమైన ఆచరణ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం పుట్టిన సమయాన్ని బట్టి మన జాతకంలో కొన్ని గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి మంచి చెడు ఫలితాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతారు.

ఎటువంటి దోషాల కైనా శాస్త్రాలలో చెప్పిన సులభ ఉపాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఆవు ద్వారా మన నవగ్రహ దోషాలను తొలగించుకోవచ్చు.

ఆవులోని అంగాలలో సమస్త దేవతలు ఉంటారని చాలామంది ప్రజలు నమ్ముతారు.సప్త ఋషులు గోవులో ఉంటరని, గోపాదాల్లో ధర్మార్థ కామ మోక్షములు ఉన్నాయని చెబుతూ ఉంటారు.

"""/"/ ఆవు కాళ్ళను కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకుంటే పాపాలు నశించిపోతాయని కూడా చెబుతారు.

అయితే ఆవులు సాయంత్రం ఇంటికి వచ్చే సమయాన్ని గోధూళి వేళ అని చెబుతూ ఉంటారు.

ఆ సమయంలో భక్తితో ఇష్ట దేవతా నామస్మరణాలతో గోధులిలో నిలబడాలి.ఇలా కొన్ని రోజులు పాటు చేస్తే తప్పక నవగ్రహ దోషాలు తొలగిపోతాయని చాలామంది ప్రజల నమ్మకం.

అదేవిధంగా గోవుకు నవధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు మొదలైనవి తినిపిస్తే శుభాలు జరుగుతాయి.

ప్రియురాలిపై హత్యాయత్నం.. భారతీయుడికి 16 ఏళ్ల జైలు , యూకే కోర్టు సంచలన తీర్పు