ఆ సినిమాలతో ఇలియానా మళ్లీ లైమ్ లైట్ లోకి రాబోతుందా? హిట్టైతే అమ్మడు దశ తిరిగినట్టే?
TeluguStop.com
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదటి దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
ఈ సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇలియానా.
ఇక తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా ఎవరన్నా తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది.
అయితే తెలుగులో మంచి ఊపు మీద ఉన్నప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడికి చెక్కేసిన ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో సినిమాలు అంతగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు.
అయితే ఇలియానా సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తరచు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు 4K ఫార్మాట్‌లో రిలీజ్ అవుతున్నాయి.
కాగా ఇప్పటికే పోకిరి సినిమా రీ రిలీజై మంచి వసూళ్ళను రాబట్టిన విషయం తెలిసిందే.
"""/" /
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ జల్సా మూవీ కూడా 4క్ లో రీ రిలీజ్ కానుంది.
అయితే ఇలియానా చివరిగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కనిపించింది.ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు.
కాగా ప్రస్తుతం ఇలియానా బ్యాక్ టు బ్యాక్ రీ రిలీజ్ మూవీస్‌తో మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇకపోతే ఇలియానాకి మంచి అవకాశాలు రావాలంటే ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు.
ఇలాంటి సమయంలో మేకర్స్ కంట్లో పడితే ఇలియానాకు మళ్లీ అవకాశాలు వచ్చి ఆన్సర్స్ ఎక్కువగానే ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
షాకింగ్: అడుక్కునే వ్యక్తి చేతిలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఎలా కొన్నాడో వినండి?