మీ జాతకంలో దోషాలు ఉన్నాయా..? అయితే కర్పూరంతో ఇలా చేయండి..!

కర్పూరంతో( Camphor ) ఎన్నో వాస్తు ప్రయోజనాలు కలుగుతాయి.అలాగే సరైన రీతిలో కర్పూరాన్ని వాడడం వలన మన ఇంటిని పట్టిపీడుస్తున్న కొన్ని రకాల దోషాలకు కూడా పరిహారం దొరుకుతుంది.

అయితే మన ఇంట్లోనే కర్పూరం తోనే ఎన్నో దోషాలను ఈ విధంగా తొలగించుకోవచ్చు.

అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంట్లో కర్పూరం వెలిగించడం వలన నెగెటివిటీ అంతా కూడా పోతుంది.

దీంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.ఇక ఇంట్లో ఉదయం, సాయంత్రం వేళల్లో కర్పూరం వెలిగిస్తూ ఉండాలి.

ఇంట్లోని నలు మూలల్లో కర్పూర ధూపం వేయాలి.ఉన్నట్టుండి ఆర్థికంగా నష్టపోతూ ఉంటే కూడా గ్రహాల అనుకూలత బాలేదని దానికి అర్థం.

"""/" / అలాంటప్పుడు వెండి పాత్రలో నాలుగు లవంగాలు( Cloves ), కర్పూరం వేసి వెలిగించి ఇల్లంతా ధూపం వేయాలి.

దీని వలన అనారోగ్య సమస్యలు( Health Problems ) ఉంటే కూడా ఆ వాసనకు తగ్గిపోతాయి.

అలాగే ఆర్థికంగా మెరుగుపడతారు.జాతకంలో దోషాలు ఏమున్నా కూడా కర్పూరంతో పరిహారాలు చేసుకోవచ్చు.

అయితే స్నానం చేసేటప్పుడు మల్లెలు, కర్పూరం నూనెను నీటిలో వేసుకొని స్నానం చేయాలి.

ఇలా చేయడం వలన మీ జాతకంలో ఉన్న ఎలాంటి దోషమైనా దూరం అవుతోంది.

ఇక లవంగాలు కర్పూర ధూపాన్ని దుర్గాదేవికి 43 రోజులపాటు వేస్తే మీ ఆర్థిక కష్టాలు అన్ని తొలగిపోతాయి.

దీంతో మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. """/" / ఇక ప్రతిరోజు ఇంట్లో మీ జీవిత భాగస్వామితో గొడవలు అవుతున్నాయి అంటే మీరు నిద్రపోయే గదిలో రోజు కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది.

ఇలా చేయడం వలన ఆ వాసనకు ప్రశాంతత నెలకొంటుంది.ఇక ప్రతి శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో కర్పూరం తైలం వేసుకొని స్నానం చేయడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా దూరం అవుతాయి.

అంతే కాకుండా ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఆ నీటిలో కర్పూరం వేసుకొని ఇల్లు తుడిచినట్టయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది.

దీంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది.

డాక్టర్ బాబు ముసలోడు… కార్తీకదీపం హీరో పై యాంకర్ శ్రీముఖి షాకింగ్ కామెంట్స్!