పుణ్య నదులు ఇప్పటికీ ఉన్నాయా.. ఇంకిపోయాయా?
TeluguStop.com
పుణ్య నదులు కొన్నిఎండి పోవచ్చు.కొన్ని మార్గాలను మార్చుకోవచ్చు.
ఒక్కో నది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో పేరుతో ఉండవచ్చు.కృష్ణా నది తన మార్గాన్ని మార్పుకున్నట్లే ఎన్నో ఆధారాలు ఉన్నాయి.
ఏవైనా భూకంపాల వంటి ప్రమాదాలు ఏర్పడినపుడు నదులు మార్గాలను మార్చుకుంటాయి.ఎడారి ప్రాంతాలుగా మారినపుడు నదులు ఇంకిపోతాయి.
బల రాముడు యమునానదీ గమన మార్గాన్ని మార్చినట్లు పౌరాణిక గాథలు ఉన్నాయి.సరస్వతీ దేవి, ఇపుడు ప్రయాగ దగ్గర అంతర్వాహినిగా ఉన్నదని చెబుతారు.
అందుకే దాన్ని త్రివేణీ సంగమ ప్రదేశం అంటారు.గోదా శబరి, క్రమంగా గోదాబరి, గోదావరి, గోదారిగా మారినట్లు భాషా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
పూర్వ కాలంలో ఉన్నపుణ్య నదులు నేడు కూడా ఉన్నాయి.దాదాపు మన పురాణాల్లో పేర్కొన బడిన నదులన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి.
శుక్తిమతి, స్వర్ణముఖి, చిత్రావతి, పాలేరు వంటివి పెద్ద పెద్ద వాగులు.నదులుగా చెప్పుకొంటాం.
వానికొక దేవతా సంబంధ కథ కల్పించి చెప్పి, వానికి ప్రశస్తి కల్పించటానికి, ఆయా ప్రాంతాలలో పుట్టిన రచయితలు, కవులు ప్రయత్నించారు అనేది సత్యం.
వానినే స్థల పురాణాలు అంటారు.వాటి వద్దకే మనం వెళ్తూ.
స్నానం ఆచరించి మన పాపాలను తొలగించుకుంటాం.ఆ నీటిని ఇంటికి తెచ్చుకొని ముట్టుడు ఉన్నప్పుడు గంగా నదితో ఇంటిని శుద్ధి చేసుకుంటాం.
మన దేశంలో ముఖ్యంగా ఏడు పుణ్య నదులు ఉన్నాయి.అవే సింధు నది, గంగా నది, యమునా నది, గోదావరి నది, కృష్ణా నది, నర్మదా నది, కావేరి నది.
తమిళ సినిమాలకు అలా తెలుగు సినిమాలకు ఇలా.. అనిరుధ్ కు ఇది న్యాయమేనా?