జగన్ బలానికి భయపడుతున్న జాతీయ పార్టీలు ? 

ఏపీలో తమది ఒంటరి ప్రయాణం అని, ఏ పార్టీతోను పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్వై.

సీపీని ఎదుర్కొనేందుకు టిడిపి , జనసేన( TDP, Jana Sena ) లు పొత్తు పెట్టుకోగా,  జనసేనతో పొత్తు కొనసాగిస్తున్న బిజెపి కూడా ఈ పార్టీలతో జత కలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇక కాంగ్రెస్ సైతం ఏపీలో జగన్ కు  వ్యతిరేకంగానే దూకుడు పెంచేందుకు సిద్ధమవుతోంది.

ఏపీలో జగన్( Jagan ) అధికారంలోకి రాకుండా చేయాలనే లక్ష్యంతో అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

టిడిపి , జనసేన పార్టీలు జగన్ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నా,  జాతీయ స్థాయిలో బిజెపి,  కాంగ్రెస్ పార్టీలు వైసీపీ పై విమర్శలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నాయి.

దీనికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.వైసీపీకి పార్లమెంట్ లో ఉన్న బలం దృష్ట్యా బిజెపి పెద్దలు జగన్ విషయంలో సానుకూలంగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

"""/" / కేంద్ర అధికార పార్టీ బిజెపి ( Bjp )మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

దీనిలో భాగంగానే రాష్ట్రాలలో పొత్తుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.కాంగ్రెస్( Congress ) ద్వారా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా,  తమ నిర్ణయాలు, బిల్లులు ఆమోదం పొందాలి అంటే రాజ్యసభ కీలకంగా ఉంటుంది .

ప్రస్తుతం అక్కడ వైసీపీకి 9 మంది సభ్యుల బలం ఉంది.అయితే ఏపీ నుంచి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు.

వీరిలో ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది.అందులో వైసిపి , టిడిపి ,బిజెపి నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

ఎన్నికల్లో వైసిపికే తమ స్థానంతో పాటుగా, మరో రెండు స్థానాలు దక్కనున్నాయి.దీంతో వైసీపీకి రాజ్యసభలో బలం 11కు చేరుతుంది.

ఇదే ఇప్పుడు వైసీపీకి కలిసి రాబోతోంది. """/" / రాజ్యసభలో తొలి నాలుగు అతిపెద్ద పార్టీల్లో వైసిపి చేరబోతోంది .

కీలకమైన బిల్లులు ఆమోదం పొందాలి అంటే వైసిపినే కీలకం కానుంది.ఇప్పటికే కేంద్ర అధికార పార్టీ బిజెపికి రాజ్యసభలో వైసీపీ కీలకమైన సమయంలో సహకారం అందిస్తుంది.

ప్రస్తుతం వైసీపీ అటు ఎన్ డి ఏ , ఇటు ఇండియా కూటమికి దూరంగానే ఉంటుంది.

టిడిపి,  జనసేన ,బిజెపి కలిసి ఏపీలో పొత్తు పెట్టుకుంటే రాజ్యసభలో బిజెపికి జగన్ సహకారం అందించడం అనుమానమే.

ఏపీలో అసెంబ్లీ , లోక్ సభ ఫలితాలు ఎలా ఉన్నా , రాజ్యసభలో వైసిపి సంఖ్యాబాలం లో మార్పు ఉండదు.

రాష్ట్రాల్లోని అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్యా  బలం  ఆధారంగానే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో రాజ్యసభలో సమీకరణాలు ఏపీలో పొత్తుల విషయంలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

దీంతో వైసిపి విషయంలో సానుకూలంగానే ఉండాల్సిన పరిస్థితి జాతీయ పార్టీలకు ఏర్పడింది.

అంబానీ వంతారాలో మోదీ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే.. సింహాల పిల్లలతో ఇంత చనువుగానా?