గవర్నర్లు ఏకులో మేకులా..? అసలేందీ లొల్లి..?
TeluguStop.com
మనదేశ రాజ్యాంగం లో ఎన్నో మౌలిక మైన అంశాలను.రాజ్యాంగ నిర్మాతలు ముందుగానే ఊహించి.
పొందు పరిచారు.అలా తీసుకు వచ్చిన అంశాల ఆధారంగా మన దేశం లో ప్రభుత్వాలు నడుస్తున్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగాన్ని అమలు చేయడానికి రాజ్యాంగ అధిపతులు ఉండాలని అనుకున్న నిర్మాతలు.
కేంద్రం లో రాష్ట్రపతిని.రాష్ట్రాల్లో గవర్నర్లను తీసుకొని వచ్చారు.
అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది.అమెరికా బ్రిటన్ లలో మాదిరి.
ముఖ్య మంత్రి కూడా ప్రజలతో ఎన్నుకోబడాలా లేక.గవర్నర్లను కేంద్రం నియమించాలా అని.
అయితే రాష్ట్రాల్లో గానీ కేంద్రం లో గానీ రాజ్యాంగ అధిపతి తో పాటు ప్రధాని గానీ ముక్యంత్రిని గానీ ఎన్నుకుంటే చాలా సమస్యలు వస్తాయి.
గవర్నర్ ఒక పార్టీ, ముఖ్యమంత్రి ఒకపార్టీ నుంచి ఒకే రాష్ట్రం లో ఎన్నుకుంటే.
ప్రభుత్వం సజావుగా నడవదని.గవర్నర్లను కేంద్రం నియమించిన అధికారం తీసుకువచ్చారు.
అయితే ఆ విధానం ఆదిలో మంచిగానే ఉన్నా.రాను రాను బెడిసి కొడుతోంది.
"""/"/
కేంద్రం లో ఏ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ నేతలను గవర్నర్లు గా నియమిస్తూ ఉన్నారు.
నిజానికి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న నేతలను, వివాదాస్పద నేతలను గవర్నర్లు గా నియమించ కూడదు.
అయితే ఈ విషయం రాజ్యాంగం లో లేదు కేవలం ఒక సంప్రదాయం గానే తీసుకొని వచ్చారు.
దానితో కేంద్రం లో అధికారం లోకి వచ్చిన ప్రతి పార్టీ.రాష్ట్రాలలో తమ నేతలను గవర్నర్లు గా నియమించి.
రాష్ట్ర ప్రభుత్వాలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ట్రై చేస్తారు.ఇక మాట వినని నేతలను గవర్నర్ ను అడ్డు పెట్టుకొని ఇబ్బందులు పెడుతుంటారు.
"""/"/
ఇలా తెలంగాణ లో సీఎం కేసిఆర్, గవర్నర్ తమిలిశై, తమిళనాడు లో స్టాలిన్, గవర్నర్ రవి, పశ్చిమ బెంగాల్ లోని మమత బెనర్జీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ ల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
ఇక పాండిచ్చేరి లో అయితే ఏకంగా అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బెడి, అప్పటి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు.
ఇక ముఖ్యమంత్రి హోదాలో నారాయణ స్వామి రోడ్డు మీద ధర్నాకు దిగారు.మరి ఎన్నో కమిటీలు ఈ వివాదాలను చక్కదిద్దాలని చెప్పిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
ఇండియన్ బీచ్‌లో తెల్లతోలు పిల్ల దోపిడీ.. సెల్ఫీకి రూ.100 వసూలు చేస్తూ అడ్డంగా దొరికింది..