కనురెప్పలు రాలిపోతున్నాయా..? అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..!

సాధారణంగా మానవ అవయవాలలో కళ్లకు( Eyes ) ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అందుకే నిరంతరం కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెబుతుంటారు.ఇక కంటి ఆరోగ్యాన్ని కాపాడడానికి అందాన్ని పెంచడంలో కంటి రెప్పలు( Eyelashes )కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

దుమ్ము నుండి కళ్ళను రక్షించడంలో కనురెప్పల పాత్ర ఎంతగానో ఉంటుంది.అయితే కొన్ని సందర్భాల్లో కనురెప్పలు రాలిపోతూ ఉంటాయి.

అయితే ఇలా కను రెప్పలు రాలిపోతున్నాయి అంటే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉంటే కనురెప్పలు రాలిపోతాయట.ఇంతకీ కనురెప్పలు రాలడానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / కనురెప్పలు రాలిపోవడానికి ప్రధాన కారణాలలో థైరాయిడ్ హార్మోన్( Thyroid Hormone ) లోపం కూడా ఒకటి.

థైరాయిడ్ హార్మోన్ లోపం వలన శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.దీంతో వెంట్రుకలు బలహీనంగా మారిపోతాయి.

హైపోథైరాయిడిజం కారణంగా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి.కాబట్టి కనురెప్పలు కూడా రాలిపోతూ ఉంటాయి.

మయస్తీనియా గ్రావిస్( Myasthenia Gravis ) అనే వ్యాధి కారణంగా కూడా కనురెప్పలు రాలిపోయే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

"""/" / అయితే శరీరంలో, కండరాలలో బలహీనత కలగడం వలన ఈ వ్యాధి వస్తుంది.

దీంతో కండరాలు సరిగా పనిచేయకపోవడం, కనురెప్పలు రాలడం లాంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.

బెల్స్ పాల్సీ వ్యాధి( Bell's Palsy Disease ) కారణంగా కూడా కనురెప్పలు రాలిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బెల్స్ పాల్సీ అన్నది ముఖ నరాల సమస్య దీని కారణంగా కనురెప్పలు, ముఖ ఖండారాలలో బలహీనత ఏర్పడుతుంది.

ఈ వ్యాధి కారణంగా నోరు కనురెప్పలు, బుగ్గల కండరాలు బలహీనంగా మారిపోతాయి.ఈ కారణంగానే కనురెప్పలు రాలిపోతాయి.

కాబట్టి కనురెప్పలు రాలిపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిరంజీవి విశ్వంభర తో అక్కడ సూపర్ సక్సెస్ కొడతాడా..?