డబుల్ ఇస్మార్ట్ కి వచ్చే కలెక్షన్స్ నిజమా లేదంటే ఫేకా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ ( Puri Jagannadh )లాంటి డైరెక్టర్ కి కమర్షియల్ సినిమాలను తీసి సక్సెస్ సాధిస్తాడనే ఒక మంచి పేరు అయితే ఉంది.
ఇక గత కొద్ది రోజుల నుంచి ఆయన తన ఫామ్ ని కొనసాగించలేకపోతున్నాడు అంటూ కొంతమంది చాలా విమర్శలైతే చేస్తున్నారు.
ఇక రామ్( Ram Pothineni ) ని హీరోగా పెట్టి ఆయన చేసిన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ ముందుకు సాగుతుందంటూ సినిమా యూనిట్ అయితే కామెంట్లను చేస్తున్నారు.
ఇక నిజానికి ఈ సినిమా రిలీజ్ అయి 5 రోజులు అయినప్పటికీ ఈ సినిమా విషయంలో చాలా లాభాలు వస్తున్నాయంటూ ఈ సినిమా తొందర్లోనే బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటూ సినిమా యూనిట్ అయితే తెలియజేస్తున్నారు.
"""/" /
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియదు గాని ఈ సినిమాకు మొదటి షో నుంచి డిజాస్టర్ టాక్ అయితే వస్తుంది.
నిజానికి సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా కలెక్షన్లు అంత బాగా రావు.
అలాంటిది ఒక డిజాస్టర్ సినిమాకి అన్ని కలెక్షన్స్ వస్తున్నాయా అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే సినిమా వాళ్లు కలెక్షన్స్ వచ్చిన, రాకపోయినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి అంటూ కొన్ని ఫేక్ ప్రమోషన్స్ అయితే చేస్తారు.
"""/" /
ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి కూడా అలాంటి ప్రమోషన్స్ ఏమైనా చేస్తున్నారా లేదంటే నిజంగానే ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనప్పటికీ లైగర్ సినిమాతో భారీగా దెబ్బతిన్న పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా( Double ISmart )తో మాత్రం కొంతవరకు పర్లేదు అనిపించుకున్నప్పటికీ ఈ సినిమాని మాత్రం సక్సెస్ చేయడంలో తను చాలా వరకు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.
చిరంజీవి ప్రయోగాత్మకమైన సినిమాలు చేయబోతున్నాడా..?