గూగుల్ పై వచ్చిన ఆరోపణలలో నిజమెంత.??
TeluguStop.com
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ అయిన గూగుల్‌కు ఒక అనుకోని షాక్ తగిలిందనే చెప్పాలి.
రెండేళ్ల క్రితం గూగుల్ పై వచ్చిన ఆరోపణలపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందనే చెప్పాలి.
మన భారత దేశ మార్కెటింగ్ రంగంలో అతిపెద్ద మార్కెట్ లలో గూగుల్ కూడా ఒకటి.
ఈ క్రమంలో గూగుల్ మీద రెండేళ్ల క్రితం ఒక ఆరోపణ వచ్చింది.అక్రమంగా మిగతా పోటీదారులను తొక్కేసి గూగుల్ సంస్థతో పాటు, అమెజాన్, యాపిల్ కంపనీలతో పాటు మరి కొన్ని కంపెనీలు కూడా ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కొన్నాయి.
ఈ క్రమంలోనే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన దర్యాప్తును వేగవంతం చేసింది.
అసలు గూగుల్ ఎదుర్కుంటున్న అభియోగాల ఏంటంటే తయారీ కంటే ముందుగానే గూగుల్ తో ఒప్పందాల్ని కుదుర్చుకున్న కంపెనీల యొక్క యాప్స్ ను ఇన్‌స్టాల్ చేయాలని డివైజ్ ముందుగానే తయారీదారులపై ఒత్తిడి తీసుకుని వస్తుందని గూగుల్‌పై అభియోగం ఉంది.
ఇలా చేయడం చట్ట ప్రకారం నేరం.ఎందుకంటే యాప్ మార్కెటింగ్‌లో వేరే ఎవరికీ స్థానం ఇవ్వకుండా గూగుల్ ముందుగానే యూజర్లను ప్రేరేపిస్తుంది.
ఈ నేపథ్యంలోనే అలియన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ కంప్లైంట్ ఇవ్వడంతో సీసీఐ 2019లో దర్యాప్తు మొదలుపెట్టింది.
"""/"/
విచారణ చేపట్టి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది.మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలో సీసీఐ ఒక అధికారిక ప్రకటనను జారీ చేసింది.అలాగే రానున్న రోజుల్లో గూగుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే విషయంపై క్లారిటీ అయితే ఇవ్వలేదు.
అసలు ఇంతకీ సీసీఐ అంటే ఏంటో అనే వివరాలు ఒకసారి తెలుసుకుందాం.కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనేది ఒక కాంపిటీషన్ యాక్ట్ అన్నమాట.
ఈ యాక్ట్ ప్రకారం వ్యాపారంలో పోటీ కార్యకలాపాలను నియంత్రించడమే ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉదేశ్యం.
ఈ యాక్ట్ ను ఉల్లఘించి ఎవరయితే అవినీతికి పాల్పడతారో వారికి భారీ జరిమానాలు విధించే అధికారం సీసీఐ కు ఉంది.
ముఖ చర్మాన్ని తెల్లగా మెరిపించే ఎఫెక్టివ్ సీరం ఇది.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా!