బి‌ఆర్‌ఎస్ కు సర్వేల ” స్ట్రోక్ “..?

తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది.

ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం బి‌ఆర్‌ఎస్( Brs Party ) తో పాటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

దీంతో ఏ పార్టీ పై చేయి సాధిస్తుంది.ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బయటకు వచ్చిన సర్వేలు పోలిటికల్ హీట్ ను మరింత పెంచాయి.

ఇటీవల టైమ్స్ ఆఫ్ నౌ నవభారత్(Times Now Navbharat ) సంస్థ నిర్వహించిన సర్వేలో 9 నుంచి 11 ఎంపీ స్థానాలను బి‌ఆర్‌ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.

దీంతో మరోసారి బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమేనా భావనా చాలమందిలో ఉంది.అయితే ఇంకా మరికొన్ని సర్వేలు చెబుతున్న దాని ప్రకారం ఈసారి బి‌ఆర్‌ఎస్ కు సీట్ల సంఖ్య తగ్గే ఉందట.

గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ 88 సీట్లు కైవసం చేసుకుంది.అయితే ఈసారి 90 నుంచి 90 సీట్లు సాధించే దిశగా బి‌ఆర్‌ఎస్ టార్గెట్ పెట్టుకుంది.

కానీ ఈసారి బి‌ఆర్‌ఎస్ కు అన్నీ సీట్లు వచ్చే అవకాశాలు తక్కువేనట.ఆ మద్య రేవంత్ రెడ్డి వెల్లడించిన సర్వే లో బి‌ఆర్‌ఎస్ కు 38 శాతం మాత్రమే ఓటు బ్యాంకు ఉంటుందని కాంగ్రెస్ కు 32 శాతం ఓటు బ్యాంక్ సొంతం చేసుకుంటుందని తెలిపారు.

</br ఇక చాలా సర్వేలు కూడా ఈసారి కాంగ్రెస్( Congress ) కు సీట్లు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పకనే చెబుతున్నాయి.

అలాగే రాష్ట్రంలో మెల్లగా బలం పెంచుకుంటున్న బీజేపీకి కూడా ఈసారి సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందట.

దీంతో ఈసారి మూడు పార్టీల మద్య టాఫ్ ఫైట్ నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అందుకే సర్వేలు చెబుతున్న దాని ప్రకారం ఈసారి బి‌ఆర్‌ఎస్ కు భారీగా సీట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే సర్వేల హడావిడి ఇలాగే కొనసాగితే బి‌ఆర్‌ఎస్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండనినేది కొందరి అభిప్రాయం.

కానీ బి‌ఆర్‌ఎస్ మాత్రం 100 స్థానాల్లో పక్కా విజయం అని ధీమా వ్యక్తం చేస్తోంది.

మరి బి‌ఆర్‌ఎస్ పై సర్వేల ప్రభావం ఎంతమేర ఉంటుందో చూడాలి.

ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య ఘర్షణ.. వైట్‌హౌస్‌లో మాటల తూటాలు