బాబు పై రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్కు లాభమా? నష్టమా ?

తెలుగు దేశాన్ని పుట్టినిల్లుగా భావిస్తున్నానని, కాంగ్రెస్ అత్తిల్లు వంటిదని పుట్టింటిపై ఎంత ప్రేమ ఉన్నా అత్తింటి గౌరవానికి ,మర్యాదకు భంగం కలిగించనని రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణ పై ఆంధ్రా పెత్తనానికి నిదర్శనం గా తరచూ చిత్రీకరించే బిఆర్ఎస్ ఈ వ్యాఖ్యలపై మాత్రం మౌనం పాటిస్తుంది.

ఎందుకంటే తెలుగుదేశం అనుకూల కార్యకర్తల వోటు బ్యాంకుతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని సెటిలర్ల ఓటు బ్యాంకు పై కన్నేసిన ఈ రెండు పార్టీలు ఎవరికి తోచిన విదం గా వారు ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

దాంతో ఒకప్పుడు తెలుగుదేశం( TDP ) నుంచి వలస వచ్చిన నేతగా రేవంత్ ఇంతకాలం బ్యాలెన్స్డ్గా మాట్లాడినా ఎన్నికల ముందు వ్యూహాత్మకంగానే ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది.

"""/" / తద్వారా తన గెలుపుకి తెలుగుదేశం శ్రేణులు ఉపయోగపడాలని కోరికను ఆయన బహిరంగంగానే అభ్యర్థించినట్లయ్యింది .

చంద్రబాబు( Chandrababu Naidu ) అంటే తనకిష్టం లేదంటే ఎవరైనా నమ్ముతారా? అంటూ సూటిగా ప్రశ్నించడం ద్వారా తాను బాబు అభిమానిని రేవంత్ బహాటంగా ఒప్పుకున్నట్లయ్యింది .

ప్రస్తుతానికి దీనిపై ఎదురుదాడి చేసేందుకు అవకాశం ఉన్నా బిఆర్ఎస్( BRS Party ) వ్యూహాత్మక మౌనం పాటిస్తుంది.

"""/" / ప్రతి ఓటు కీలకంగా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో రేవంత్ పై అటాక్ చేస్తే అది తిరిగి తమకు ఎక్కడ ఇబ్బందిగా మారుతుందో అన్న కోణంలో అధికార పార్టీ నేతలు ఎవరూ ఈ విషయంపై మాట్లాడడానికి ఇష్టపడట్లేదు.

అయితే ఆశ్చర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ పై ఎదురు దాడి చేస్తుంది.

అత్తింటికి పంపడానికి పుట్టిల్లు టిడిపి ఇచ్చిన కట్నం ఎంత? అని ఆ కట్నం డబ్బులతోనే ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేలను కొన్నావా? అంటూ వైసీపీ నేతలు విమర్శించడం గమనార్హం .

అయితే చంద్రబాబు పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుందన్నది పెద్ద ప్రశ్న గా మారింది.

అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ కు లాభం కలిగేలా ఉన్నందున ఎటువంటి విమర్శలు లేవు.

అయితే ఒక్కసారి అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత దీని తాలూకు ప్రభావాన్ని రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఎదుర్కొంటారా అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.

ఏది ఏమైనా అంది వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్న పార్టీలు తమకు లాభం కలిగే ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలుస్తుంది.

మోకాళ్ళు నల్లగా అసహ్యంగా కనిపిస్తున్నాయా.. అయితే ఈ రెమెడీని ప్రయత్నించండి!