రాజకీయ నేతలు సేవకులా? ఉద్యోగులా?
TeluguStop.com
నల్లగొండ జిల్లా:తెలంగాణ ధనిక రాష్ట్రం అంటే ప్రజలు ధనవంతులు కాలేదు.రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ధనవంతులు అయినారు.
అందుకే మునుగోడులో మద్యం మరియు ఓటుకు మూడు వేల నుండి పదిహేను వేలు పంచుతున్నారు.
వీళ్ళు మంది కుటుంబాలను ముంచి తన కుటుంబాన్ని మేపుతున్నారు.కుటుంబానికి ప్యాలెస్,తన రాసలీలకు పామ్ హౌస్ లు కట్టుకుంటున్నారు.
ఎన్నికలలో పోటీ చేసి,వారు వంద కోట్లు ఖర్చు పెట్టి,వేల కోట్లు సంపాదించాలి ఇది లక్ష్యం.
అసలు రాజకీయం సేవనా?వ్యాపారమా? ఉద్యోగమా? సేవ అయితే జీతం ఎందుకు?గన్ మెన్ లు ఎందుకు?మేము దొంగలం మందిని ముంచి బ్రతికే వాళ్ళం కావున గన్ మెన్ లు లేకుండా తిరిగితే ప్రజలు తంతారని రాజకీయ నాయకులు భయంతో ఉంటున్నారు.
జీతాలు ఇచ్చి అనుచరులను పెట్టుకొని కబ్జాలు,కలెక్షన్లు చేస్తారు.మేయర్ వంద కోట్లు,కార్పొరేటర్ 20 కోట్లకు తక్కువ సంపాదించడం లేదు.
ప్రజా సేవ చేయాలని రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు అసలే లేదు.వారు గెలవాలి,వారి పార్టీ గెలవాలి,దాని కోసం రాక్షాసులై ప్రవర్తిస్తున్నారు.
చరిత్రలో ఏ రాక్షసుడు కూడా వీళ్లన్ని దుర్మార్గాలు చేసిన వాడు లేడు.-నారగొని ప్రవీణ్ కుమార్.
హలో అబ్బాయిలు.. దట్టమైన గడ్డాన్ని కోరుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకే!