లోన్ రికవరీ ఏజెంట్లు అసభ్యకరంగా వేధిస్తున్నారా.. ఇలా ఫిర్యాదు చేయండి..!

బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల( Banks _ నుండి అవసరాల కోసం అప్పు తీసుకోవడం మామూలే.

ప్రతి వ్యక్తికి అత్యవసరం అయినప్పుడు లోన్ తీసుకోవడం తప్ప మరో దారి ఉండదు.

అయితే ప్రతి నెల ఈఎంఐలు చెల్లిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు.కానీ ఇంట్లో కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈఎంఐలు చెల్లించడం కుదరదు.

ఎప్పుడైతే తీసుకున్న అప్పుకు ఈఎంఐ చెల్లించమో అప్పటినుండి ఫైనాన్స్ కంపెనీ నుండి పదేపదే కాల్స్ రావడం మొదలవుతుంది.

ఆ తర్వాత లోన్ రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి లోన్ వెంటనే కట్టాలంటూ వేధించడం మొదలు పెడతారు.

ఒక్కోసారి లోన్ రికవరీ ఏజెంట్లు కుటుంబ సభ్యులను అవమానించడం, అసభ్యకరంగా మాట్లాడడం, సాటి మనిషికి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వకుండా పరువు పోయేలా మాట్లాడడం చేస్తూ కష్టమర్లకు వేధిస్తుంటారు.

ఇలా చేసి తిరిగి తమ ఈఎంఐ డబ్బులు( EMI Amount ) చెల్లించుకోవాలనే లోన్ రికవరీ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తుంటారు.

"""/" / రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ రికవరీ ఏజెంట్ల దృష్ట్యా కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది.

లోన్ రికవరీ ఏజెంట్లు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లకు ఫోన్ చేయాలి.

లోన్ రికవరీ ఏజెంట్ల నుండి ఎటువంటి అవమానకరమైన మెసేజ్లు వంటివి కస్టమర్లకు రాకూడదు.

ఈఎంఐ చెల్లించాలంటూ కస్టమర్లను మానసికంగా, శారీరకంగా వేధించకూడదు.ఒకవేళ లోన్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లతో దురుసుగా ప్రవర్తిస్తే కస్టమర్లు ఫిర్యాదు చేయవచ్చు.

అది ఎలాగో చూద్దాం. """/" / లోన్ రికవరీ ఏజెంట్ నుండి వచ్చే మెసేజెస్, ఈ మెయిల్స్, కాల్ రికార్డింగ్( Call Recording ) లను భద్రపరచుకోవాలి.

అంటే లోన్ రికవరీ ఏజెంట్ కు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు ఆధారాలను సేకరించి, లోన్ ఏ బ్యాంకు నుంచి తీసుకున్నామో ఆ బ్యాంకులో ఫిర్యాదు చేయాలి.

బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు.లీస్ స్టేషన్లో కూడా తగిన సహాయం అందకపోతే కోర్టులో సివిల్ ఇంజక్షన్ దాఖలు చేయవచ్చు.

అంతేకాదు లోన్ రికవరీ ఏజెంట్ పై పరువు నష్టం కేసును కూడా దాఖలు చేయవచ్చు.

ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోతే నేరుగా ఆర్బీఐ లో ఫిర్యాదు చేసి ఉపశమనం పొందవచ్చు.

ఆర్బీఐ నిబంధనల( RBI Regulations ) ప్రకారం రికవరీ ఏజెంట్లు తప్పు చేస్తే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు బాధ్యత వహించాల్సిందే.

కాబట్టి లోన్ తీసుకున్నాక మన వైపు ఎటువంటి తప్పు లేకపోతే ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు.

‘మేమంతా సిద్ధం ‘  సక్సెస్ అయ్యిందా ? మళ్లీ భారీగా ప్లాన్ చేస్తున్న జగన్