ఎడమచేతివాటం గలవారు అత్యంత శక్తివంతులా? మరి కుడిచేతివాటం గలవారు?

ఆగస్టు 13వ తేదీకి ఓ ప్రత్యేకత వుంది.అయితే ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.

అదే "ఇంటర్నేషనల్‌ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే".1976, ఆగస్టు 13 నుంచి ఈ సంప్రదాయం అనేది కొనసాగుతోంది.

కానీ మనలో అనేకమందికి తెలియదు.కుడి చేతివాటం వారు కోకొల్లుగా వున్న ఈ ప్రపంచంలో ప్రతీ పని ఎడమచేతితోనే చేసుకునేవారు కూడా అనేకమంది వున్నారు.

ఇక ఎడమచేతి వాటం కలిగిన వారిలో అనేకులు చరిత్ర పుటల్లో వారికంటూ ప్రత్యేక పేజీని రాసుకున్నవారు అనేమంది వున్నారు.

సైంటిస్టులు, క్రీడాకారులు, చక్రవర్తులు, తాత్వికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలుగా పేరుగాంచిన ప్రముఖులందరూ ఎడమచేతివాటం వారే కావడం విశేషం.

ఈ భూమిపై ఉన్న మొత్తం జనాభాలో 5-10% మంది ఎడమచేతి వాటం వారు వున్నారని ఓ సర్వే ద్వారా తెలిసింది.

అందులోనూ అమెరికా మొత్తం జనాభాలో 30 మిలియన్ల ప్రజలు ఎడమచేతి వాటంవారే ఉండటం కొసమెరుపు.

ఎడమచేతి వాటం ఉన్న ప్రముఖులుని తీసుకుంటే అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, బారక్ ఒబామా, బిల్ గేట్స్, లేడీ గాగా, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మేరీ క్యూరీ, అరిస్టాటిల్, లియోనార్డో డా విన్సీ, చార్లీ చాప్లిన్, టామ్ క్రూజ్, రాబర్ట్ డి నీరో, ఏంజెలీనా జోలీ, మార్లిన్ మన్రో, బ్రాడ్ పిట్, సిల్వెస్టర్ స్టాలోన్, రికీ మార్టిన్, ఆల్బర్ట్ ఐన్‌స్టిన్‌, స్టీవ్ జాబ్స్‌తోపాటు ప్రస్తుత భారత ప్రధాని నరేద్ర మోదీ కూడా ఎడమచేతి వాటం కలిగినవారు కావడం గమనార్హం.

"""/"/ ఇకపోతే ఎడమచేతి వాటం వారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు తెలుసుకుందాం.

కుడి చేతివాటం వారితో పోల్చితే వీరిలో మద్యపానం అలవాటు మూడు రెట్లు ఎక్కువ వుంటాయని తేలింది.

సాధారణ మనుషులకంటే వీరిలో 4-5 నెలలు ఆలస్యంగా మానసిక పరిపక్వత అనేది ఉంటుంది.

టాప్‌ టెన్నీస్‌ ప్రేయర్లలో 40 శాతం ఎడమచేతివాటం వారే కావడం విశేషం.26 మంది అమెరికా ప్రెసిడెంట్లలో 8 మంది ఎడమచేతి వాటంవారే.

40 యేళ్లు దాటిన మహిళలు గర్భం దాల్చితే పుట్టే పిల్లల్లో 128 శాతం ఎడమచేతి వాటం ఉన్న శిశువులు జన్మిస్తున్నారని వైద్యులు ధృవీకరించారు.