ప్రభుత్వ సంక్షేమ పథకాలు అధికార పార్టీ కార్యకర్తల కోసమేనా…?

తెలంగాణ రాష్ట్రలో ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ కార్యకర్తల కోసమేనా అని బహుజన సమాజ్ పార్టీ నేరేడుచర్ల పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి ఫైరయ్యారు.

శనివారం నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రేషన్ డీలర్లు జాబితా ప్రకారం అర్హులైన వారికీ కాకుండా అధికార పార్టీకి చెందిన వారికి రావడమే దీనికి నిదర్శనమని అన్నారు.

అధికార పార్టీ వారైతేనే ప్రభుత్వ పథకాలకు అర్హులనేలా ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డు పెట్టాలని ఎద్దేవా చేశారు.

నేరేడు చర్ల మున్సిపాలిటీలో మైనారిటీ లోన్లు విషయంలో నిరుపేదలు దరఖాస్తు చేసుకుంటే లోకల్ అధికార పార్టీ నాయకులు తమ పార్టీ వారికే ఇస్తామని బహిరంగంగా చెప్పడం సిగ్గుచేటన్నారు.

ప్రభత్వం నుండి వచ్చే పథకాలు అర్హులైన పేదలకు కాకుండా అధికార పార్టీ వారికే చెందడం చాలా బాధాకరమని అవేదన వ్యక్తం చేశారు.

అధికార బిఆర్ఎస్ పార్టీపై ప్రజలు విసిగిపోయారని,ఓటు అనే ఆయుధం ద్వారా బుద్ది చెబుతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు తక్కెల్ల నాగార్జున,పోలె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఒక్క దెబ్బతో చుండ్రు మొత్తం పోవాలా.. అందుకు ఇదే బెస్ట్ రెమెడీ!