ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు వేస్టా.. మొబైల్స్ లాగా తయారవుతున్నాయా..?

ఎలక్ట్రిక్ వెహికల్స్( Electric Vehicles ) పెట్రోల్ వాహనాల వలె అంత రిలయబుల్‌గా ఉండడం లేదని కొందరు ఓనర్లు షాక్ ఇస్తున్నారు.

టాటా మోటార్స్ కంపెనీ( Tata Motors Company ) ఇటీవల కాలంలో అనేక ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఎలక్ట్రిక్ కారు కర్వ్.ఈవీని ఒక యజమాని రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో డ్రైవ్ చేశారు.

వారు ఈ కారును నగరంలోని రోడ్లపై, గ్రామీణ ప్రాంతాలలోని చిన్న రోడ్లపై, హల్దిఘాటి కొండదారి మీద, మౌంట్ ఆబు వరకు హైవే మీద నడిపించారు.

ఈ కర్వ్.ఈవీ కారులో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి.

దీని వల్ల టాటా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరుగుతాయని అనుకుంటున్నారు.కానీ, ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై క్లెయిమ్ చేసిన దానికంటే చాలా తక్కువ దూరమే నడుస్తోంది.

ఇవి మొబైల్ ఛార్జర్ల వలె తయారవుతున్నాయని సదరు యజమాని ఇటు వల్ల ఒక వెబ్‌సైట్‌కి వెల్లడించారు.

గత కొన్ని సంవత్సరాలలో ఎలక్ట్రిక్ కార్లతో పాటు మిగతా కార్ల అమ్మకాలు చాలా పెరిగాయి కానీ ఇప్పుడు మార్కెట్లో దాదాపు రూ.

70,000 కోట్ల విలువ చేసే కార్లు అమ్ముడుపోకుండా స్టాక్ ఉండిపోయాయి.అందుకే కంపెనీలు కొత్త కార్ల డెలివరీలను వేగవంతం చేస్తున్నాయి.

బెనిఫిట్స్ కూడా అందిస్తున్నాయి.అంతేకాకుండా, అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో కొన్ని ఎలక్ట్రిక్ కార్లు కొన్నేళ్లలోనే వాటి విలువలో సగం వాల్యూ కోల్పోతున్నాయి.

దీని వల్ల ఈవీ కార్లు అమ్ముడవుతున్న వేగం తగ్గుతోంది. """/" / పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లలో ఎలక్ట్రిక్ కార్లు త్వరగా విలువ కోల్పోతాయి.

ఉదాహరణకు, 2023 కియా EV6 GT లైన్ కారు( 2023 Kia EV6 GT Line Car ) కొత్తగా వచ్చినప్పుడు దాని ధరలో మూడింట ఒక వంతు తగ్గిపోయింది.

అదే సమయంలో, పెట్రోల్ లేదా డీజిల్ కార్లు ఏడాదిలో కేవలం 15% విలువ తగ్గుతాయి.

ఎలక్ట్రిక్ కార్ల టెక్నాలజీ చాలా వేగంగా మారుతుంది.దీని వల్ల కొత్త ఎలక్ట్రిక్ కార్లు వచ్చినప్పుడు పాత కార్లు త్వరగా పాతవిగా మారిపోతాయి.

"""/" / పెట్రోల్ లేదా డీజిల్ కార్ల టెక్నాలజీ మాత్రం చాలా నెమ్మదిగా మారుతుంది.

ఉదాహరణకు, మారుతి స్విఫ్ట్ కారులో ఉన్న K-సీరీస్ ఇంజన్ 15 సంవత్సరాలకు పైగా మార్పులు చేయకుండా ఉంది.

అంటే, పెట్రోల్ లేదా డీజిల్ కార్లు 3-4 సంవత్సరాలకు ఒకసారి మార్పులు చేస్తారు.

ఎలక్ట్రిక్ కార్లు మాత్రం త్వరగా పాతవిగా మారిపోతాయి.దీని వల్ల కార్లను కొనేవాళ్లు కొత్త ఆలోచనతో ఆలోచించాలి.

కార్లను త్వరగా పాతవిగా మారిపోయే గ్యాడ్జెట్స్ లాగా కలిసి వస్తోంది బ్యాటరీలు కూడా రెండు మూడు ఏళ్లకే బాగా పవర్ లాస్ అవుతున్నాయని కొంతమంది అంటున్నారు.

సమస్యలకు చెక్ పెడితేనే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల మనుగడ సాగుతుంది లేదంటే ఇవి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్27, శుక్రవారం 2024