అసంతృప్తి టీఆర్ఎస్ నేతలు ఈటెల వైపు ఆకర్శితులవుతున్నారా?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని రకాల వ్యూహాలు వేసినా అందులో ఎన్నో కొన్ని వ్యూహాలు మాత్రం ఖచ్చితంగా సఫలమవుతాయి.

కాని కొన్ని మాత్రం తీవ్రంగా బెడిసి కొడతాయి.అందుకు ఉదాహరణే ఈటెల ఎపిసోడ్ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.

అయితే కేటీఆర్ ను సీఎంగా చేయడానికి ఈటెల అంగీకరించలేదనే కారణంతోనే ఈటెలకు కేసీఆర్ కు మధ్య చెడిందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

అయితే భూ అక్రమణల ఆరోపణతో ఈటెలను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసిన కేసీఆర్ ఆ తరువాత భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశించారు.

అయితే విచారణ చేపట్టడంతో ఇక ఈటెల కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చడం జరిగింది.

అయితే ఇక ఈటెల కొత్త పార్టీ పెడుతునట్టు పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయితే ఈ వార్తలకు బలం చేకూరేలా ఈ మధ్య కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అవడం జరిగింది.

అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నారని విశ్వసనీయ సమాచారం.

అయితే టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుండి సేవలందిస్తున్నా పదవులు దక్కక అసంతృప్తి నేతలు ఈటెల పార్టీ వైపు వెళ్లే దిశగా పావులు కదుపున్నారట.

మరి ఈటెల పార్టీ పెడితే టీఆర్ ఎస్ నేతలు ఎంత మంది ఈటెల పార్టీలో చేరతారో చూడాల్సి ఉంది.

వైరల్ వీడియో: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డ్యాన్స్‌ తో సందడి చేసిన కలెక్టర్‌