విమర్శలు సరే చర్యలేవి? నిలదీసిన చంద్రబాబు!

ఎన్నికల సంవత్సర అయినందున ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాజకీయాల్లో నేతలు దూకుడు పెంచేశారు .

దాదాపు అన్నీ ప్రదాన పార్టీలు ప్రజల్లో వివిద కార్యక్రమాలతో దూసుకెళ్తున్నాయి .తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) అయితే రాష్ట్రం నలుమూలలా ఫోకస్ చేసి సభలు సమావేశాలతో అదరగొడుతుంది .

ఒకవైపు యువగళం పేరిట రాష్ట్రాన్ని చుట్టేస్తుంటే మరోపక్క మెరుపు సమావేశాలతో చంద్రబాబు దూసుకెళ్తున్నారు.

కుప్పంలో మూడు రోజుల పర్యటన చేస్తున్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) అంత అవినీతి పరుడు దేశం మొత్తం మీద వెతికినా కనిపించడని సాక్షాత్తు దేశ హోం మంత్రే ఈ విషయం చెప్పారని ఆయన విమర్శించారు.

విమర్శలు చేసినప్పుడు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారంటూ ఆయన కేంద్ర బాజాపా ను కూడా ఆయన ప్రశ్నించారు .

అధికారంలో ఉండి కూడా అవినీతిని ఎదుర్కోకపోతే ఎలా అంటూ ఆయన వ్యాఖ్యానించారు.దేశంలో 45 సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న తనకే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వని ముఖ్యమంత్రి ఈ తుగ్లక్ అంటూ ఆయన విమర్శించారు.

"""/" / రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్ధవంతంగా ఉపయోగించు కుని సంపదను సృష్టిస్తామని , పెరిగిన సంపదను ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామని, ఆ సత్తా తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

మేనిఫెస్టో ( Manifesto )అమలకు కట్టుబడి ఉన్నామని ఎన్నికలకు ముందే అర్హులందరికీ టోకెన్లు కూడా ఇస్తామని ఆయన ప్రకటించారు .

"""/" / రాష్ట్రాన్ని రౌడీల చేతుల్లో పెట్టారని, కుప్పంలో రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయని అన్ని గమనిస్తూ, లెక్కపెడుతున్నామని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు ఆలోచించి అవకాశం ఇవ్వాలని , ఒక్క అవకాశం అన్నారని ఇస్తే ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని రాష్ట్రాన్ని మళ్లీ తిరిగి అభివృద్ధి పథంలోకి నడిపించే సమర్థత తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్… వీడియో వైరల్…