నాటుకోడి గుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయా.. వాటికి ఎందుకంత క్రేజ్!
TeluguStop.com
గుడ్డు( Egg ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఉడికించిన గుడ్డును నిత్యం తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ అందుతాయి.
అలాగే మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉంటాయి.అందువల్ల సంపూర్ణ ఆహారంలో గుడ్డు కూడా ఒక భాగం అయిపోయింది.
అయితే బాయిలర్ గుడ్డు కంటే నాటుకోడి గుడ్డుకు క్రేజ్ ఎక్కువ.బాయిలర్ గుడ్లు తెలుపు రంగులో ఉండే.
నాటుకోడి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి.రుచి పరంగా ఎటువంటి తేడా ఉండదు.
"""/" /
అయితే బాయిలర్ గుడ్లతో పోలిస్తే నాటు కోడి గుడ్డు కొంచెం చిన్న సైజు లో ఉంటాయి.
పైగా డబుల్ ప్రైజ్ ను కలిగి ఉంటాయి.అయినప్పటికీ చాలా మంది ప్రజలు నాటు కోడి గుడ్లను తినేందుకే మొగ్గు చూపుతుంటారు.
నాడు కోడి గుడ్లలో పోషకాలు అధికంగా ఉంటాయని.h3 Class=subheader-style ఆరోగ్యానికి/h3p ఎక్కువ మేలు చేస్తాయని భావించడమే అందుకు కారణం.
కానీ అది పూర్తిగా అవాస్తవం.కలర్ డిఫరెంట్ గా ఉనప్పటికీ రెండు రకాల గుడ్లలో దాదాపు ఒకే మొత్తంలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లను కలిగి ఉంటాయి.
మరియు ఒకే మొత్తంలో కేలరీలను అందిస్తాయి.సో.
బాయిలర్ గుడ్లతో పోలిస్తే నాటుకోడి గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి అనేది కేవలం ప్రజల అపోహ మాత్రమే.
"""/" /
ఇక ఒక ఉడకబెట్టిన గుడ్డు ద్వారా మీరు 6 గ్రాముల ప్రోటీన్, 0.
6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 5 గ్రాముల కొవ్వులు, 213 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్, 63 మిల్లీగ్రాములు సోడియం, విటమిన్ బి3, బిటమిన్ బి2, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, క్లోరిన్, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, పొటాషియం, జింక్, సల్ఫర్, ఐరన్, కాల్షియం, కాపర్, ఫాస్పరస్.
ఇలా అనేక పోషకాలను పొందుతారు.నిత్యం ఒక ఉడకబెట్టిన గుడ్డు తింటే బరువు నిర్వహణలో ఉంటుంది.
ఎముకలు, కండరాలు బలోపేతం( Bone Health ) అవుతాయి.మెదడు చురుగ్గా పని చేస్తుంది.
గుడ్డులో పొటాషియం, ఫోలేట్ మరియు బి విటమిన్లు గుండె ఆరోగ్యానికి అండగా ఉంటాయి.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.మరియు రోజూ ఉడికించిన గుడ్డు తింటే చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
చివరిసారిగా మాట్లాంది నేనే .. కొడుకు మరణంపై సుచీర్ బాలాజీ తండ్రి ఆవేదన