ఈ క్రమంలో రెండు ప్రధాన పార్టీలు.రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తు న్న నేపథ్యంలో ఎటూ కాకుండాపోయిన కాపులను తాము చేరదీయాలని బీజేపీ భావిస్తోంది.
ఈ విషయం.పైస్థాయిలో చర్చలు కూడా జరుగుతున్నాయి.
అయితే.దీనిపై ఎలాంటి క్లారిటీ లేకున్నా.
బీజేపీని ఒక కులానికి కట్టేయాలనే వ్యూహాన్ని మాత్రం పెద్దలు ఒప్పుకొనే పరిస్థితి కనిపించడం లేదు.
ఎందుకంటే.బీజేపీ ఒక జాతీయ పార్టీ.
ముఖ్యంగా హిందూ సామాజిక వర్గాన్ని లక్ష్యం చేసుకుని ముందుకు సాగుతున్న పార్టీ.అందుకే కేవలం కులాల వారీగా బీజేపీని డెవలప్ చేయాలని పార్టీ నాయకులు ఎప్పుడూ భావించలేదు.
కానీ, దీనికి విరుద్ధంగా కాపులకు మాత్రమే బీజేపీని పరిమితం చేయాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఇదేదిశగా అడుగులు వేస్తున్నారనే విషయం తెలిసిందే.
"""/"/
ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ను కలిశారు.