యాపిల్ వాచ్‌లు ఆరోగ్యానికి కీడు చేస్తున్నాయా? వాస్తవమెంత?

యాపిల్ స్మార్ట్‌వాచెస్( Apple Watch ) గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

ప్రస్తుతం ఆపిల్ స్మార్ట్‌వాచెస్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందుతోంది.ఈ నేపథ్యంలో కొత్త కొత్త ఫీచర్లు, డిజైన్‌లతో స్మార్ట్‌వాచీలు అందుబాటులోకి వస్తున్నాయి.

కేవలం ఈ కంపెనీనే కాకుండా మార్కెట్లో ఎన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయో అందరికీ తెలిసినదే.

ఫిట్‌నెస్ మరియు హెల్త్ ట్రాక్ విషయంలో స్మార్ట్ వాచెస్ బాగా క్లిక్ అయ్యాయని చెప్పుకోవచ్చు.

అవును, ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంలో స్మార్ట్‌వాచ్‌లు ఎంతో కీలకంగా పనిచేస్తున్నాయి. """/" / మరి ఇలాంటి సమయంలో యాపిల్ వాచ్‌లు ఆరోగ్యానికి కీడు చేస్తున్నాయా? అంటే అవుననే చెబుతున్నాయి కొన్ని సర్వేలు.

ప్రీమియం యాపిల్ స్మార్ట్‌వాచ్ 100% యాక్యురసీతో టోటల్ బాడీని ట్రాక్ చేస్తూ మరింత ప్రయోజనాలను అందిస్తోందనేది అందరికీ తెలిసినదే.

అయితే ఈ యాపిల్ వాచ్ వల్ల కలిగే హెల్త్‌ బెనిఫిట్స్‌ మాట అటుంచితే, రోగాలు వస్తాయని తాజాగా ఒక స్టడీ చెప్పుకొచ్చింది.

అవును, యాపిల్ రిస్ట్‌బ్యాండ్స్‌ వల్ల లేని రోగాలు కొనితెచ్చుకునే ప్రమాదం ఉందని వెల్లడించింది.

అదేవిధంగా ఫిట్‌బిట్ రిస్ట్‌బ్యాండ్( Fitbit Wrist Band ) తొడుక్కునే వారికి కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆ స్టడీ చెబుతోంది.

"""/" / విషయం ఏమిటంటే.వాచ్, ఫిట్‌బిట్ రిస్ట్‌బ్యాండ్స్‌పై స్టెఫిలోకాకస్ ఎస్‌పీపీ, E.

కోలి, సూడోమోనాస్ Spp అనే బ్యాక్టీరియా వచ్చి చేరుతుందని ఈ అధ్యయనం కనిపెట్టి మరీ నిరూపించి చెబుతున్నది.

ఇక ఈ బ్యాక్టీరియా గురించి మీరు వినే వుంటారు.జ్వరం, విరేచనాలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

ఇక ఈ అధ్యయనాన్ని US-బేస్డ్ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ ( FAU ) పరిశోధకులు చేపట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అందుకే యాపిల్ వాచ్, ఫిట్‌బిట్ యూజర్లు వాటిని క్రమం తప్పకుండా సబ్బు, నీరు లేదా క్రిమిసంహారక కెమికల్స్‌తో శుభ్రం చేయాలని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు.

స్నానం చేసేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు రిస్ట్‌బ్యాండ్స్‌ను ధరించడం మానుకోవాలని కూడా సూచిస్తున్నారు.

ప్రభాస్ కి ఏమిచ్చిన రుణం తీరదు.. ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కామెంట్స్ వైరల్!