సర్వేలు ఎవరికి అనుకూలం ?

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు ( AP Elections ) జరగనున్నాయి.

ఈసారి ఎన్నికల్లో విజయం కోసం అధికార వైసీపీతో పాటు టిడిపి జనసేన పార్టీలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

ఇకపోతే ఎన్నికల ముందు పార్టీల యొక్క బలాబలాలను అంచనా వేసేందుకు సర్వేలు( Surveys ) వెలుగులోకి వస్తుంటాయి.

సర్వేల ఆధారంగా ప్రస్తుతం ప్రజాభిప్రాయం ఎలా ఉందనే  దానిపై పార్టీలు కూడా ఓ అంచనాకు వస్తుంటాయి.

ఈ నేపథ్యంలో సర్వేల ఆధారంగా ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ? ఏ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అవుతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.

కాగా ఇప్పటికే చాలా సర్వేలు బహిర్గతం అయినప్పటికి కొన్ని మెజారిటీ సర్వేలు అధికార వైసీపీ పార్టీనే( YCP ) మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెబుతూ వచ్చాయి.

అటు టీడీపీ జనసేన కూటమి( TDP Janasena ) కూడా ఈసారి ఏపీలో గట్టిగానే ప్రభావం చూపే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి మరికొన్ని సర్వేలు.

ఇలా సర్వేలు కూడా మిశ్రమంగా ఫలితాలను ఇస్తుండడంతో ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడం కష్టంగా మారింది.

అయితే వచ్చే ఎన్నికల్లో 175 టార్గెట్ తో ఉన్న వైసీపీ మాత్రం విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది.

"""/" / ఇటీవల ఓ జాతీయ సంస్థ వేలాడించిన సర్వేలో వైసీపీ 24-25 సీట్లు సొంతం చేసుకునే అవకాశం తేలడంతో వైసీపీ నేతలకు విజయం పై ఉన్న కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతోంది.

ఇటీవల మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) మాట్లాడుతూ సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని 175 స్థానాల్లో విజయం సాధించడం గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు.

అయితే సర్వేల ఫలితాలు ఎంతవరకు నిజమౌతాయనేది ప్రశ్నార్థకమే. """/" / ప్రస్తుతం ఉన్న జగన్ సర్కార్ పై( Jagan Govt ) ప్రజల్లో సానుకూలతతో పాటు వ్యతిరేకత కూడా గట్టిగానే ఉంది.

ఇప్పుడు సర్వేలలో సానుకూల ఫలితాలు వచ్చినప్పటికి ఎన్నికల్లో కూడా ఏదే ఫలితాలు వస్తాయా అంటే చెప్పడం కష్టమే అంటున్నారు రాజకీయ నిపుణులు.

మరి ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందో చూడాలి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?