కీల‌క నేత‌లంద‌రినీ జ‌గ‌న్ కు దూరం చేసుకుంటున్నారా..?

రాజ‌కీయాల్లో ఎంత ఎక్కువ మందిని క‌లుపుకుని పోతేనే అంత బాగా అధికారం చేతిలో ఉంటుంది.

అంతే గానీ ఎవ‌రితో నాకేంటి అనే ప‌ద్ధ‌తిలో సాగితే మాత్రం చివ‌ర‌కు అధికార‌మే దూర‌మ‌వుతుంది.

ఈ విష‌యం వైసీపీ అధినేత ఏపీ సీఎం జ‌గ‌న్‌కు బాగా తెలుసు.కీల‌క నేత‌లంతా జ‌గ‌న్ వెంట‌నే ఉన్నారంటే ఆయ‌న ఎంత బాగా వారిని క‌లుపుకుని పోతున్నారో అర్థం అవుతుంది.

అయితే ఇప్పుడు కొంచెం ప‌రిస్థితులు మారుతున్న‌ట్టు కనిపిస్తోంది.ఆయ‌న చాలామంది కీల‌క నేత‌ల‌ను దూరం చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది.

ఇప్పుడు వైసీపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.తాను వైసీపీ పెట్టిన మొద‌ట్లో చాలామంది కీల‌క నేత‌లు కాంగ్రెస్ ను వీడి జ‌గ‌న్ కోసం వైసీపీలోకి వ‌చ్చారు.

అలా వ‌చ్చిన వారిని ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలిపించుకున్నారు.2014 ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడినా స‌రే ఆయ‌న వెంట‌నే చాలామంది కీల‌క నేత‌లు న‌డిచారు.

వారికి కీల‌క ప‌ద‌వులు ఇవ్వ‌డంలో జ‌గ‌న్ వెన‌కంజ వేస్తున్నారనే ప్ర‌చారం సాగుతోందిముఖ్యంగా జ‌గ‌న్ త‌ల్లి విజయమ్మ ఇప్పుడు జ‌గ‌న్‌కూ దూరం పాటిస్తున్నారంట‌.

ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాటి కీల‌క నేత‌లంతా వైసీపీని బ‌ల‌ప‌ర‌చ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

"""/"/ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్ కోసం కాంగ్రెస్ లో త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు కూడా రాజీనామాలు చేసి వ‌చ్చారు.

అప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాక జ‌గ‌న్ కోస‌మే నిల‌బ‌డ్డారు.అయితే ఇప్పుడు వీరి మంత్రి ప‌ద‌వుల‌ను జ‌గ‌న్ మార్చ‌బోతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది.

వీరికి పార్టీలో కీల‌క ప‌ద‌వులు ఇచ్చి మంత్రి ప‌ద‌వుల‌ను తీసేయ‌నున్నార‌ని వైసీపీలో జోరుగా చ‌ర్చ సాగుతోంది.

ఇప్ప‌టికే వైఎస్ ష‌ర్మిల జ‌గ‌న్ కు దూరం అయింది.జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హరించిన అందరినీ జ‌గ‌న్ దూరం చేసుకుంటున్నార‌నే ప్ర‌చారం బాగా సాగుతోంది.

ఇదే జ‌రిగితే రాబోయే రోజుల్లో జ‌గ‌న్‌కు పెద్ద ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌వ‌నే చెప్పాలి.

మెగా ఫ్యామిలీకి దూరంగా అల్లు అర్జున్… ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన బన్నీ!