పెళ్లి పీటలు ఎక్కనున్న ఎంపీ,ప్రీ వెడ్డింగ్ వీడియో వైరల్

ఈ రోజుల్లో పెళ్లి మాటచెప్పగానే సామాన్యులు సైతం ప్రీ వెడ్డింగ్ అని,మెహందీ అని ఇలా పలు రకాలుగా పెళ్ళికి ముందే వీడియో షూట్స్ అనేవి కామన్ అయిపోయాయి.

అలాంటిది ఒక ఎంపీ పెళ్లి అంటే మామూలుగా ఉంటుందా.అందుకే ప్రీ వెడ్డింగ్ వీడియో ఒకటి షూట్ చేశారు.

అయితే ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ ఎంపీ ఎవరంటే అతి పిన్న వయసులో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

ఈ నెల 17న ఆమె వివాహం తన చిన్నప్పటి స్నేహితుడు శివప్రసాద్ తో జరగనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ వీడియోను తీసుకున్నారు ఈ జంట.అయితే ప్రస్తుతం వీరి ప్రీ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మాజీ ఎమ్మెల్యే గొట్టేడి దేముడు కుమార్తె అయిన మాధవి మొదట ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.

అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆమె ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టి కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌పై రెండున్నల లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు.

మరోవైపు గొలుగొండ మండలం కేడీ పేట గ్రామానికి చెందిన శివప్రసాద్‌ బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం ఒక కాలేజ్ లో కరస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నారు.

వీరిద్దరి వివాహం మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో జరగనుంది.వివాహానంతరం ప్రముఖుల కోసం విశాఖ సమీపంలోని రుషికొండ వద్ద ఓ రిసార్ట్స్‌లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది.

Iframe Width="560" Height="315" Src="https://!--wwwyoutube!--com/embed/ICZ6YACWRI0" Frameborder="0" Allow="accelerometer; Autoplay; Encrypted-media; Gyroscope; Picture-in-picture" Allowfullscreen/iframe.

నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా.. నెటిజన్ కు హీరోయిన్ షాకింగ్ కౌంటర్ వైరల్!