చరణ్ ‘RC16’ కోసం ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ .. ఎవరంటే?
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా వెలుగొందు తున్నాడు.
ఈ మధ్య ఈ సినిమా ఆస్కార్ రావడంతో ఈయన ఫేమ్ మరింత పెరిగింది అనే చెప్పాలి.
మునుపటి కంటే మరింత యాక్టివ్ గా ఉంటూ వరల్డ్ వైడ్ గా తన స్టార్ డమ్ ను పెంచుకుంటూ పోతున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత భారీ లైనప్ సెట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
"""/" /
ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్( Director Shankar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'గేమ్ చేంజర్'( Game Changer ).
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవలే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వచ్చి ఆడియెన్స్ ను ఫ్యాన్స్ ను మెప్పించింది.
దిల్ రాజు( Dil Raju )నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక చరణ్ ఈ సినిమా తర్వాత తాను చేయబోయే నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేసారు.
RC16సినిమా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా( Director Buchi Babu ) దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
మరి తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ బయటకు వచ్చింది.ఈయన ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను ఫిక్స్ చేశారట.
"""/" /
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎం ఎం కీరవాణి( MM Keeravani) కి ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకు మరో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ తో పని చేయనున్నారట.
RC16 సినిమాకు ఏఆర్ రెహమాన్( AR Rahman )ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం:ఎమ్మెల్యే