ఒకరిని బాధ పెడితే… నువ్వు బాధపడాల్సిందే… కర్మ ఎవరిని వదలదు: ఏఆర్ రెహమాన్
TeluguStop.com
ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు(Oscar Award) గ్రహీత ఏఆర్ రెహమాన్(AR Rehaman) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సంగీత దర్శకుడుగా ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఈయన ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఇటీవల ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బాను(Saira Bhanu)కు విడాకులు (Divorce)ప్రకటించిన విషయం మనకు తెలిసిందే 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఈ దంపతులు విడాకులు తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక వీరి విడాకుల ప్రకటన రాగానే వీరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాకుండా వీరిపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.
ఇలా విడాకుల విషయాని ప్రకటించగానే తన గురించి వచ్చిన విమర్శలపై తాజాగా ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విడాకుల విషయాన్నే ప్రకటించగానే చాలామంది విమర్శలు చేశారు.అయితే ఈ విమర్శలు చేసిన వారందరూ కూడా నా కుటుంబ సభ్యులేనని నేను భావిస్తాననీ తెలిపారు.
సెలబ్రిటీల జీవితాలలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలని కుతూహలం అందరికీ ఉంటుందని తెలిపారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/04/ar-rahman-react-trolls-on-his-orce-a!--jpg" /
సెలబ్రిటీల జీవితాలలో ఏం జరుగుతుందో తెలుసుకొని వారిని విమర్శిస్తారు.
ఈ విమర్శల నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు.ఈరోజు నువ్వు ఒకరిని బాధపడితే రేపు నువ్వు బాధ పడాల్సిన సమయం వస్తుందని ఈయన కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడారు.
మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఎవరు కూడా అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తల్లి భార్య చెల్లి బిడ్డలు ఉంటారు ఎవరైనా బాధాకరమైన మాటలు మాట్లాడినప్పుడు నేను దేవుని ఒకటే కోరుకుంటాను వారిని క్షమించి వారిని సన్మార్గంలో నడిపించమని కోరుకుంటాను అంటూ ఈ సందర్భంగా రెహమాన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.