ఏప్రిల్ 3.. జగన్ ఏం చేయబోతున్నారు ?
TeluguStop.com
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అందరి దృష్టి ఏప్రెల్ 3 పై పడింది.ఎందుకంటే ఈ తేదీన సిఎం జగన్ ఎమ్మెల్యేలతోనూ, పార్టీ సమన్వయ కర్తలతోనూ పార్టీ కీలక నేతలతోనూ భేటీ నిర్వహించనున్నారు.
అసలెందుకు సిఎం జగన్ అత్యవసరంగా సమావేశం నిర్వహించబోతున్నారు అనే దానిపై పోలిటికల్ సర్కిల్స్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి( YCP ) గట్టిగానే షాక్ తగలడం, అదే విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలమంది అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు రావడం వంటి ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా ముందస్తు ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు వినికిడి.
ఇక సీట్ల కేటాయింపు, ఎమ్మెల్యేల పనితీరు వంటి అంశాలపై కూడా జగన్ చర్చించే అవకాశం ఉందట.
"""/" / ఇప్పటికే జగన్ ఎమ్మెల్యేలతో పలుమార్లు జర్చలు జరిపారు.కొందరి ఎమ్మెల్యేల పని తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూడా.
వైఖరి మార్చుకొని నిత్యం ప్రజల్లో ఉండాలని 30 నుంచి 42 మంది ఎమ్మెల్యేలకు సిఎం జగన్(YS Jagan Mohan Reddy ) గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.
ఇక 3 జరిగే సమావేశంలో తీరు మార్చుకొని ఎమ్మెల్యేలపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరం.
ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందు సాధారణ ఎన్నికల విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న వైఎస్ జగన్.
ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత కొంత అసహనంగానే ఉన్నారు.అందుకు కారణం వైసీపీకి పట్టున్న మూడు స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడమే.
దాంతో అలెర్ట్ అయిన జగన్ నియోజికవర్గ ఎమ్మెల్యేల నుంచి ప్రస్తుతం ఉన్న మంత్రుల దాకా అందరి పనితీరుపై అరా తీసే అవకాశం ఉంది.
"""/" /
ఇక గత కొన్ని రోజులుగా మంత్రి వర్గ విస్తరణపై కూడా చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న అయిదు మంది మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
దీనిపై కూడా ఏప్రెల్ 3న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలిన తరువాత ముందస్తు ఎన్నికల అంశం మరింత ఊపందుకుంది.
విపక్ష పార్టీలు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారనే ప్రచారం చేస్తున్నాయి.ఈ మద్య జగన్ వరుసగా డిల్లీ ప్రయాణం అవుతూ కేంద్ర పెద్దలతో సమావేశం అవుతున్నారు.
ఈ సమావేశాలు ముందస్తు ఎన్నికల కోసమే అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట.మరి దీనిపై కూడా ఏప్రెల్ 3న స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఏది ఏమైనప్పటికి ఏప్రెల్ 3న సిఎం జగన్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
How Modern Technology Shapes The IGaming Experience