ఒకప్పుడు డాక్టర్.. ఇప్పుడు డీఎస్పీ.. నెల్లూరు మానస సక్సెస్ స్టోరీ వింటే గ్రేట్ అనాల్సిందే!

సాధారణంగా డాక్టర్ అయిన వాళ్లు డాక్టర్ గా కెరీర్ ను కొనసాగించడానికే ఇష్టపడతారు.

డాక్టర్ అయిన తర్వాత ఇతర రంగాలపై దృష్టి పెట్టే వాళ్లు చాలాఅంటే చాలా తక్కువమంది ఉంటారు.

ఎపీపీఎస్సీ గ్రూప్ 1( APPSC Group-1 ) తుది ఫలితాల్లో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మానస( Manasa ) మంచి ర్యాంక్ సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు.

ప్రజా సేవ చేయాలనే తపన ఉన్న మానస కడులూరు ఒకప్పుడు డాక్టర్ గా పని చేసి ఇప్పుడు డీఎస్పీగా పని చేస్తున్నారు.

మానస ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.తిరుపతిలో విద్యాభ్యాసం పూర్తి చేసిన మానస నెల్లూరు నారాయణలో బీడీఎస్ చేశారు.

బీడీఎస్ లో తొలి ఏడాదిలోనే రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంక్ సాధించిన మానస బీడీఎస్ చదువులో ఏకంగా ఏడు బంగారు పతకాలను సాధించడం గమనార్హం.

2021 సంవత్సరం నుంచి మానస మిలిటరీలో వైద్యాధికారిగా( Military Doctor ) పని చేశారు.

"""/" / అదే సమయంలో ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్1 జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.

ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు గ్రూప్1 కోసం అమె ప్రిపేర్ అయ్యారు.ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే మానస పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు ప్రశంసలను సొంతం చేసుకున్నారు.

నెల్లూరు మానస ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ప్రశంసలను అందుకున్నారు.మానస సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.

"""/" / మానస కడులూరు ఒకప్పుడు డాక్టర్ గా పని చేసి ఇప్పుడు డీఎస్పీగా( DSP ) పని చేస్తూ ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నారు.

సొంతంగా చదివి తాను కెరీర్ పరంగా సక్సెస్ అయ్యానని ఆమె చెబుతున్నారు.ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా మానస కెరీర్ పరంగా ముందడుగులు వేయడం గమనార్హం.

డీఎస్పీగా మానస ప్రజల కష్టాలు, సమస్యలను పరిష్కరించడానికి ఎంతో కష్టపడి కృషి చేస్తున్నారని సమాచారం అందుతోంది.

చెట్ల కొమ్మల్లో ఇరుక్కున్న ఆవు.. ఎలా కాపాడాడో చూస్తే..