ఐదుసార్లు ఫెయిల్.. ఆ మాటల స్పూర్తితో డీఎస్పీ.. లక్కాకుల గౌతమ్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో ఎంతో కష్టపడితే మాత్రమే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది.తాజాగా 2022 గ్రూప్1 ( Appsc Group1 )ఫలితాలు విడుదల కాగా ఈ ఫలితాలలో పేదింటి బిడ్డలు సత్తా చాటారు.

నంద్యాలలోని రైతు నగరానికి చెందిన గౌతమ్ ఎపీపీఎస్సీ( Gowtham ) గ్రూప్1 ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు.

తన సక్సెస్ స్టోరీ గురించి గౌతమ్ మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

"""/" / గౌతమ్ తండ్రి పోలీస్ కాగా ఒక సందర్భంలో డీఎస్పీ సాధించే ఉద్యోగం సేవ చేసేది అయితే జన్మ సార్థకమవుతుందని గౌతమ్ తండ్రితో పోలీస్ స్టేషన్ లో ఉన్న సమయంలో చెప్పారు.

డీఎస్పీ చెప్పిన మాటలు గౌతమ్ ను కదిలించగా గౌతమ్ సాధిస్తే సివిల్స్ సాధించాలి లేదా గ్రూప్స్ లో నిలబడాలని భావించాడు.

గౌతమ్ కుటుంబం చాలా సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చి స్థిరపడింది.

"""/" / 2015లో డిగ్రీ పూర్తి చేసిన గౌతమ్ న్యూఢిల్లీ( New Delhi )కి వెళ్లి సివిల్ సర్వీసెస్ కోసం మూడు సంవత్సరాల పాటు కఠిన శిక్షణ తీసుకున్నారు.

అయిదుసార్లు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తే మూడుసార్లు మెయిన్స్ వరకు వెళ్లినా ఆశించిన ఫలితం రాలేదు.

రెండేళ్ల క్రితం గౌతమ్ సీ.ఐ.

ఎస్.ఎఫ్ కు ఎంపికై ఝార్ఖండ్ లో కమాండెంట్ గా చేరారు.

గ్రూప్1 లక్ష్యం సాధించి డీఎస్పీ అయిన గౌతమ్ ఐఏఎస్, ఐపీఎస్ కోసం మరింత కష్టపడతానని చెబుతున్నారు.

భవిష్యత్తులో గౌతమ్ అనుకున్న లక్ష్యాన్ని సాధించి కెరీర్ పరంగా మరింత ఎదుగుతారేమో చూడాలి.

డీఎస్పీ మాటల స్పూర్తితో డీఎస్పీ అయిన గౌతమ్ కెరీర్ పరంగా మరింత ఎదిగి మరెంతో మందికి స్పూర్తిగా నిలుస్తారేమో చూడాలి.

గౌతమ్ సక్సెస్ స్టోరీకి ఫిదా అవుతున్నామని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

వావ్, 12 ఏళ్లకే స్కూబా డైవింగ్‌లో ప్రావీణ్యత సాధించిన బెంగళూరు అమ్మాయి..?