తెలంగాణలో విశ్వవిద్యాలయాలకు ఇంఛార్జ్ వీసీల నియామకం
TeluguStop.com
తెలంగాణలో విశ్వ విద్యాలయాల( Telangana Universities )కు ఇంఛార్జ్ వీసీల నియామకం జరిగింది.
ఈ మేరకు పది విశ్వ విద్యాలయాలకు కొత్త ఉపకులపతులను ప్రభుత్వం నియమించింది.ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ( Osmania University)ఇంఛార్జ్ వీసీగా దాన కిశోర్ ( Dana Kishore )నియామకం అయ్యారు.
జేఎన్టీయూ ఇంఛార్జ్ వీసీగా బి.వెంకటేశం, తెలుగు యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా శైలజారామయ్యర్ నియామకం కాగా.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా రిజ్వి నియమితులయ్యారు.అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా వాకాటి కరుణ, తెలంగాణ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా సందీప్ సుల్తానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా సురేంద్ర మోహన్ నియామకం అయ్యారు.
కాగా పది యూనివర్సిటీల్లో వీసీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ జనవరిలో విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్ కి సలహాలు ఇస్తున్న అల్లు అర్జున్…కథ మారిపోయిందా..?