ఏపీలో మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు( AP Elections ) ముగిసాయి.మే 13వ తారీకు పోలింగ్ ముగిసిన అనంతరం.

మే 14వ తారీకు నుండి పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో వైసీపీ.

టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.పల్నాడులో( Palnadu ) బాంబులు కూడా విసురుకున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ తర్వాత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఈ పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘం( CEC ) సీరియస్ గా తీసుకోవడం జరిగింది.

దీంతో ఆయా జిల్లాలలో బాధ్యులైన ఉన్నత అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు కొంతమందిని బదిలీ చేయడం జరిగింది.

"""/" / ఇదే సమయంలో ప్రాథమిక దర్యాప్తు కూడా చేయించడం జరిగింది.దీంతో పలు ఉన్నతాధికారులపై వేటుపడటంతో తాజాగా రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎస్పీలను నియమించింది.

పల్నాడు- మల్లికా గర్గ్,( Malika Garg ) అనంతపురం - గౌతమి శాలి,( Gowthami Sali ) తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్ ను( Harshavardhan ) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే పల్నాడు కలెక్టర్ గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు అనంతరం కూడా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఈసీ భావించింది.

దీంతో అదనపు కేంద్ర బలగాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించడానికి కేంద్ర హోం శాఖకు లేఖ రాయడం జరిగింది.

కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.

డబుల్ ఇస్మార్ట్ హిట్ అయితే పూరి కి ఆ స్టార్ హీరో డేట్స్ ఇస్తాడా..?