మండలాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంపీపీల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం స్పెషల్ ఆఫీసర్లగా జిల్లాస్థాయి అధికారులను నియమించారు.

బోయినపల్లి మండలానికి జిల్లా ఫిషరీస్ అధికారి జీ శివ ప్రసాద్, చందుర్తి మండలానికి జిల్లా పశుసంవర్ధక అధికారి కే కొమురయ్య, ఇల్లంతకుంట మండలానికి జిల్లా సహకార అధికారి బుద్ధ నాయుడు, గంబీరావుపేట మండలానికి జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్ రాఘవేందర్,కొనరావుపేట మండలానికి వేములవాడ ఆర్డీవో ఎస్ రాజేశ్వర్, ముస్తాబాద్ మండలానికి జిల్లా ఉద్యానవన అధికారి ఎం జ్యోతి, రుద్రంగి మండలానికి ఎస్డీసీ ఆర్ వీ రాధాబాయ్, తంగళ్లపల్లి మండలానికి సిరిసిల్ల ఆర్డీవో రమేష్, వీర్ణపల్లి మండలానికి జిల్లా భూగర్భ జలశాఖ అధికారి జీ నర్సింలు, వేములవాడ మండలానికి జిల్లా ఆడిట్ ఆఫీసర్ బీ స్వప్న, వేములవాడ రూరల్ మండలానికి జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఎల్లారెడ్డిపేట మండలానికి జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ ను నియమించారు.

సంధ్య థియేటర్ ఘటన గురించి నిహారిక రియాక్షన్ ఇదే.. ఆమె ఏమన్నారంటే?