ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ సీపీ నియామకం..!
TeluguStop.com
ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case ) విచారణపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది.
ఈ మేరకు కేసు విచారణ కోసం స్పెషల్ సీపీని( Special CP ) నియమించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందుకు ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.కాగా నెల రోజులుగా ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు,( EX DCP Radhakishan Rao ) మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
అదేవిధంగా ఈ కేసులో ఆధారాల సేకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు.అయితే ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక సీపీ నియామకం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
బాలయ్య బోయపాటి మూవీలో స్టార్ హీరోయిన్ కూతురు.. ఆ పాత్రలో కనిపిస్తారా?