నెలకు 2 సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే చాలు జుట్టు ఒత్తుగా, పొడుగ్గా మారుతుంది!
TeluguStop.com
అధిక హెయిర్ ఫాల్( Hair Fall ) కారణంగా జుట్టు రోజురోజుకు పలుచగా మారుతుందా? హెయిర్ గ్రోత్ లేక పొడవాటి జుట్టును పొందలేకపోతున్నారా? అయితే ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్ అద్భుతంగా సహాయపడుతుంది.
నెలకు కేవలం రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే చాలు మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా మారుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ప్యాక్ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు బ్లాక్ రైస్ ( Black Rice )వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బ్లాక్ రైస్ ను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో రైస్ మిల్క్ ను సపరేట్ చేసుకోవాలి.
"""/" /
ఇప్పుడు మరోసారి మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు రైస్ మిల్క్ వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు అరటిపండు ముక్కలు.ఒక అవకాడో పల్ప్ ( Avocado Pulp )వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకొని బాగా మిక్స్ చేయాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
"""/" /
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
నెలకు కేవలం రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.
దాంతో జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల కురులు స్మూత్ అండ్ షైనీ గా మెరుస్తాయి.
డ్రై హెయిర్ తో బాధపడే వారికి కూడా ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
ఈ ప్యాక్ వేసుకుంటే డ్రై హెయిర్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.జుట్టు సిల్కీగా మారుతుంది.
రూ.16 లక్షలు నావే.. బ్యాంకు తప్పిదానికి రైతు షాక్ ట్రీట్‌మెంట్?