వారంలో ఒక్కసారి ఈ ప్యాక్‌ను వేసుకుంటే జుట్టు రాలనే రాలదు!
TeluguStop.com
హెయిర్ ఫాల్.ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మంది దీని బానిసలుగా ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, హార్మోన్ ఛేంజస్, ఒత్తిడి ఇలా ఎన్నో విషయాలు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి.
దాంతో కుదుళ్లు బలహీనపడి హెయిర్ ఫాల్ సమస్య అధికం అయిపోతుంది.మీరు కూడా హెయిర్ ఫాల్ బాధితులేనా.
? అయితే ఇకపై నో టెన్షన్.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హెయిర్ ప్యాక్ ను వారంలో ఒక్కసారి వేసుకుంటే.
జుట్టు రాలనే రాలదు.మరి లేటెందుకు ఆ హెయిర్ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల పెసలు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, రెండు గ్లాసుల వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.
ఉదయాన్నే ఒక కప్పు కొబ్బరి ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి.ఆ పేస్ట్ నుండి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్‌లో నానబెట్టుకున్న పెసలు, మెంతులు మరియు సరిపడా కొబ్బరి పాలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.
"""/"/
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసి మిక్స్ చేయాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్‌ను ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెడ్ బాత్ చేయాలి.
వారంలో ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్‌ను వేసుకుంటే కుదుళ్లు బలంగా మారతాయి.తద్వారా హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అయిపోతుంది.
అదే సమయంలో హెయిర్ డ్యామేజ్, డ్రై హెయిర్ వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.